అలీ ఒక భారతీయ నటుడు. ఈయన తెలుగు ఇండస్ట్రీలో హీరోగా, హాస్యనటుడుగా, టీవీ వ్యాఖ్యాతగా రాణించడం జరిగింది. తెలుగులో ఏకంగా 1150 కి పైగా చిత్రాలలో నటించడం జరిగింది. ఈయన రెండు నంది అవార్డులను, రెండు ఫిలింఫేర్ అవార్డులను సొంతం చేసుకోవడం జరిగింది.
1979లో నిండు నూరేళ్లు చిత్రం ద్వారా బాలు నటుడుగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు. ఆ తర్వాత నాలుగైదు చిత్రాలలో బాలనటుడుగా నటించడం జరిగింది. ఆ తర్వాత సినిమాలలో హాస్య పాత్రలో నటించడం ప్రారంభించాడు. ఇక ఎస్వీ కృష్ణారెడ్డి దర్శకత్వం వహించిన యమలీల సినిమాలో హీరోగా నటించిన జరిగింది.
అడపాదడపా హీరో పాత్రలో నటిస్తూ, ఎక్కువగా హాస్య పాత్రలో నటించాడు. ఈయన నటించిన రాజేంద్రుడు గజేంద్రుడు చిత్రంలో ఇంద చాట అనే పదం ప్రేక్షకులు ఎన్నటికీ మర్చిపోలేరు. ఇక వరుస సినిమాలతో హాస్య పాత్రలో నటిస్తూ మంచి గుర్తింపు పొందాడు.
ఇలా కెరీర్లో బిజీగా ముందుకు సాగుతున్న అలీ గతంలో ఒక సినిమా ఫంక్షన్ లో పాల్గొన్నప్పుడు.. తాను కెరీర్లో ముందుకు రాణించడానికి తాను బాల నటుడుగా సీతాకోకచిలుక చిత్రంలో నటించడమే ముఖ్య కారణం అని తెలపడం జరిగింది.
తాను బాల నటుడుగా నటించే సినిమాలను నిర్మాత ఏడిద నాగేశ్వరరావు గారు చూసి, అలీని చెన్నై పిలిపించి సీతాకోకచిలుకల సినిమాలో బాల నటుడుగా అవకాశం ఇచ్చారు. ఇక బాల నటుడుగా ఆ సినిమాలో దెబ్బలు తినాలి. అలా డైరెక్టర్ ఆ సన్నివేశంలో అలీని కొట్టడం జరిగింది.
అలీ ఏడవడం మొదలుపెట్టాక ఏడిద నాగేశ్వరరావు గారు జేబులో 200 రూపాయలు పెట్టారట. అలా ఆ సినిమా తన కెరీర్ కు మెయిన్ టర్నింగ్ పాయింట్ అంటూ తెలపడం జరిగింది. ఆ తర్వాత వరుస అవకాశాలు వచ్చి ఇండస్ట్రీలో రాణించగలుగుతున్నానని పేర్కొనడం జరిగింది.
ఈయన బుల్లితెరపై కూడా పలు టీవీ కార్యక్రమాలకు వ్యాఖ్యతగా వ్యవహరించడం జరిగింది. ప్రస్తుతం ఆలీతో సరదాగా అనే టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నారు. ఇక రెండు మూడు సినిమాలలో నటిస్తూ బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.