Nageswara Rao: సినిమా ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ ఉండే సంగతి మనకు తెలిసిందే కొంతమంది స్టార్ హీరోలు వారి వారసుల కెరియర్ కోసం ఇతర హీరోలను కూడా తొక్కేసే ప్రయత్నాలు జరుగుతుంటాయి అంటూ ఎంతో మంది ఈ విషయాల గురించి బహిరంగంగా తెలియజేశారు. ఇకపోతే టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోలుగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో అక్కినేని నాగేశ్వరరావు కూడా ఒకరు. వందల సినిమాలలో నటించిన ఏఎన్నార్ ఎన్నో వైవిద్య భరితమైన పాత్రలలో నటించి హీరోగా ప్రేక్షకులను మెప్పించారు. అదేవిధంగా పలు సినిమాలలో తండ్రి తాతయ్య పాత్రలలో కూడా నటించి మెప్పించారు.
నాగేశ్వరరావు చివరి రోజుల వరకు కూడా సినిమాలలో నటించారని చెప్పాలి. ఈయన చివరిగా మనం అనే సినిమాలో నటించి అనంతరం మరణించారు. ఇక నాగేశ్వరరావు స్టార్ హీరోగా కొనసాగుతున్న సమయంలో తన కుమారుడు నాగార్జున అని కూడా ఇండస్ట్రీకి పరిచయం చేశారు అయితే తన కుమారుడుతో పాటు ప్రముఖ నిర్మాత రామానాయుడు కూడా తన కుమారుడు వెంకటేష్ను హీరోగా పరిచయం చేయబోతున్నారని తెలిసిన వెంటనే తన కొడుకుకు అడ్డు రాకూడదని ప్రయత్నాలు కూడా చేశారట.
అసలు వెంకటేష్ ఏంటి హీరో కావడం ఏంటి అంటూ ఈయన పలువురు దర్శక నిర్మాతల వద్ద కూడా అప్పట్లో ప్రస్తావించినట్లు తెలుస్తోంది.. ఇండస్ట్రీలో తన కొడుకు అగ్ర హీరోగా కొనసాగాలన్న నేపథ్యంలో నాగేశ్వరరావు నాగార్జున కి టాప్ డైరెక్టర్ల చేత సినిమా అవకాశాలను ఇప్పించి హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టారని తెలుస్తోంది. ఇక రామానాయుడు కూడా ఏ మాత్రం తగ్గకుండా తన కొడుకుని కూడా స్టార్ డైరెక్టర్లతో సినిమాలు చేయించి స్టార్ హీరోగా తన కొడుకును కూడా సక్సెస్ చేశారు. ఇలా ఇద్దరు కూడా ఇండస్ట్రీలో టాప్ ఫోర్ స్టార్ హీరోల లిస్టులో ఉన్నారు.
ఇలా వెంకటేష్ నాగార్జున ఇండస్ట్రీలో స్టార్ హీరోలుగా కొనసాగుతున్న నేపథ్యంలో రామానాయుడు నాగేశ్వరరావు ఇద్దరు ఓ నిర్ణయానికి వచ్చారు వెంకటేష్ చెల్లెల్ని స్వయంగా నాగార్జునకి ఇచ్చే వివాహం జరిపించారు ఇక ఈ దంపతులకు నాగచైతన్య జన్మించారు కొన్ని కారణాల వల్ల వీరిద్దరు విడాకులు తీసుకొని విడిపోయారు ఇలా వీరు విడాకులు తీసుకున్న నాగార్జున వెంకటేష్ మధ్య మంచి అనుబంధం ఉంది ఈ రెండు కుటుంబాలు తరచు పలు కార్యక్రమాలలో పాల్గొంటూ సందడి చేస్తున్నారు.
