హీరో హరీష్ సినిమాలకు దూరం కావటానికి ఆ పొరపాటే కారణమా!

హరీష్ ప్రముఖ సినీ నటుడు. తెలుగు,తమిళం, కన్నడ, మలయాళం, హిందీలలో 280 పైగా సినిమాలలో నటించాడు. ఈయన 1975లో హైదరాబాదులో జన్మించాడు. హరీష్ తనకు నాలుగు సంవత్సరాల వయసు ఉన్నప్పుడే బాల నటుడుగా ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. తర్వాత దక్షిణాది అన్ని భాషలలోనే కాక హిందీలో కూడా బాల నటుడిగా ఎన్నో సినిమాలలో నటించాడు.

హరీష్ తన చిన్ననాటి స్నేహితురాలు అయిన సంగీతం ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఈమె కూడా సినిమాలలో పలు క్యారెక్టర్లలో నటించడం జరిగింది. ఈయనకు ఇద్దరు కుమారులు సంతానం. పెళ్లి తర్వాత సంగీత సినిమాలకు దూరంగా ఉండి కుటుంబ బాధితులను చూసుకుంటుంది.

1990లో ఇ.వి.వి దర్శకత్వం వహించిన ప్రేమ ఖైదీ చిత్రం ద్వారా కథానాయకుడుగా పరిచయం అయ్యాడు. 1983లో ఆంధ్రకేసరిలో నటించినందుకుగాను అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీఆర్ గారిచే బాల నటుడుగా రాష్ట్ర పురస్కారం అందుకున్నాడు. 1996లో వచ్చిన ఓహో నా పెళ్ళంట సినిమా ద్వారా ప్రత్యేక జూరీ అవార్డు తీసుకున్నాడు. ఈయన ఎన్నో అవార్డులను సొంతం చేసుకున్నాడు.

హరీష్ నటించిన ప్రేమఖైదీ సినిమా అన్ని భాషలలో విడుదల కావడం చేత దక్షిణాదిలో అనేక అవకాశాలు వచ్చాయి. హిందీలో కూడా అవకాశాలు వచ్చి అక్కడ కూడా కొన్ని సినిమాల్లో నటించడం జరిగింది. అయితే హరీష్ ఎక్కువగా హిందీ సినిమాలపై దృష్టి పెట్టి తెలుగు సినిమాల వైపు కాస్తంత నిర్లక్ష్యం చేశాడు.

తెలుగులో అవకాశాలు తగ్గి తర్వాత సహాయక పాత్రలలో అడపాదడపా అవకాశాలు వచ్చాయి. రెండవది డైరెక్టర్లు ఏది చెబితే అది వినడం ద్వారా సినిమాలలో కాస్త క్రేజ్ తగ్గి అవకాశాలు తగ్గుముఖం పట్టాయి.ప్రతి అవకాశాన్ని కాదు అనకపోవడంతో సినిమాలో హీరో ఫ్రెండ్ క్యారెక్టర్ లో ఎక్కువగా వచ్చేవి. సోలోగా నటిస్తున్న సినిమాలు క్రేజీ తగ్గిస్తూ ఉండడంతో ఇక సినిమాలకు దూరంగా ఉన్నాడు. తన తండ్రి వ్యాపారాలను చూసుకుంటూ ముంబైలో స్థిరపడిపోయాడు.