నటుడు పద్మనాభం జీవితంలో మర్చిపోలేని విషాద సంఘటన అదేనట!

పద్మనాభం తెలుగు సినిమా, రంగస్థలం నటుడు, సినీ నిర్మాత, దర్శకుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన పూర్తి పేరు బసవరాజు వెంకట పద్మనాభరావు. ఈయన 1931లో కడప జిల్లాలోని పులివెందులలో జన్మించాడు. ఈయనకు చిన్నప్పటినుండి సంగీతం, పద్యాలు అంటే ఎంతో ఇష్టం. 1936లో చింతామణి నాటకంలో కృష్ణుడి వేషం వేసి ఒక వెండి కప్పును బహుమతిగా పొందాడు.

తమ్ముడు సుదర్శన్ తో కలిసి ప్రొద్దుటూరులో వారాలు చేసుకుంటూ చదువుకుంటున్న చదువు వండబట్టలేదు. థియేటర్ మేనేజర్ ను మచ్చిక చేసుకుని విడుదలయ్యే అన్ని సినిమాలు చూసేవాళ్ళు. సైకిల్ కొనేందుకు డబ్బు సంపాదించాలని ఎవరికీ చెప్పకుండా రైల్లో టికెట్ లేకుండా ముందు బెంగుళూరు వెళ్లి అక్కడ ఏం చేయాలో తెలియక మద్రాసు వెళ్ళాడు. అక్కడ నటి కన్నాంబ ఇంటికి వెళ్లి జరిగిన విషయం అంతా చెప్పాడు.

తన గానకళతో ఆమెను మెప్పించి రాజరాజేశ్వరి కంపెనీలో పనిలో చేరాడు. అందులో పని చేస్తుండగా పాదుకాపట్టాభిషేకం సినిమాలో కోరస్ గా పాడే అవకాశం వచ్చింది. 1945లో విడుదలైన మాయాలోకం లో కోరస్ పాడడమే కాక అందులో ఒక పాత్రలో కూడా నటించాడు. వరుస అవకాశాలతో బిజీగా అయిపోయి నటనకు మంచి గుర్తింపు వచ్చింది. యోగివేమన సినిమా తీసిన కేవీ రెడ్డి గుణసుందరి కథ తీస్తుండడంతో ఆయన్ను వాహిని స్టూడియోలో వెళ్లి కలువగా ఒక పాట పాడించుకొని, విని గొంతు బాగా లేనందున ఏమైంది నీకు బాగా పాడే వాడివి కదా అంటూ కోపం, చిరాకు చూపిస్తూ ఇలా అయితే కప్పులు కూడా కడగడానికి పనికిరావు అన్నాడు.

దీనితో నిరాశ పడిన పద్మనాభం సింహాద్రిపురం వెళ్లిపోయాడు. అదే సమయంలో తేలు కుట్టి తమ్ముడు ప్రభాకర్, జబ్బు చేసి చెల్లెలు మరణించడంతో విరక్తి చెంది సినిమాలకు దూరమయ్యాడు. గుంతకల్ లో ఉన్న చిన్నాన్న శ్రీనివాసరావు దగ్గర కరణికం నేర్చుకుంటూ ఉండగా వీర కుమార్ అనే సినిమా షూటింగ్ కు రమ్మని జెమిని వారి నుండి కబురు వచ్చింది. షూటింగ్ జరుగుతున్న సమయంలో విజయ సంస్థ వారితో ఏర్పడ్డ పరిచయం అతని కెరీర్ ను మలుపు తిప్పింది.

ఆ తర్వాత మళ్లీ వరుస అవకాశాలు రావడం జరిగింది. 1964లో నిర్మాతగా ఎన్టీఆర్ తో దేవత సినిమా నిర్మించి మంచి విజయం పొందాడు. 2010లో గుండెపోటుతో మరణించడం జరిగింది.