అదిరే అభిని అవమానించిన ఆ వ్యక్తి.. ఇంతకు ఏం జరిగిందంటే?

అదిరే అభి జబర్దస్త్ కమెడియన్ గా అందరికీ సుపరిచితుడే. ఇతని అసలు పేరు హరికృష్ణ. సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా ఉద్యోగం చేసేవాడు. ఈయనకు నటించాలనే ఆసక్తి చాలా ఎక్కువ. రవీంద్ర భారతిలో ఈయన చేసిన కొరియోగ్రాఫర్, డాన్స్ ప్రదర్శనలు చేసిన అభికి ఈశ్వర్ సినిమాలో అవకాశం వచ్చింది.

అభి ప్రదర్శన చూసిన డాక్టర్ సి.నారాయణరెడ్డి మీలో ప్రతిభ ఉంది అంటూ హరికృష్ణ పేరును కాస్త అభినయ కృష్ణ గా మార్చి సినిమా అవకాశం ఇచ్చాడు. అభి భారత దేశంలోనే కాక సార్జా, సింగపూర్ వంటి దేశాలలో 1500కు పైగానే ప్రదర్శనలు ఇచ్చాడు. ఇక 2002లో ఈశ్వర్ సినిమాలో హీరో ఫ్రెండ్ గా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత విష్ణు, విద్యార్థి, గౌతమ్ ఎస్. ఎస్.సి సినిమాలలో నటించాడు. బాహుబలి 2 కు రాజమౌళి దగ్గర సహాయ దర్శకుడిగా పనిచేశాడు. ఈటీవీలో ప్రసారమవుతున్న జబర్దస్త్ షో ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకొని పాపులర్ అయ్యాడు. తెలుగులో ప్రసారమైన మీలో ఎవరు కోటీశ్వరుడు కార్యక్రమం కు క్రియేటివ్ డైరెక్టర్ గా కూడా పనిచేశాడు.

ప్రస్తుతం అభి పలు చానల్ లలో యాంకర్ గా, డాన్సర్ గా, స్టాండ్ అప్ కమెడియన్ గా రాణిస్తున్నాడు. ఇలా సాఫీగా సాగుతున్న సమయంలో గతంలో ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అభి తన మనసులోని భావాలను ఇంటర్వ్యూ తో పంచుకున్నాడు. తాను అవకాశాల కోసం ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న సమయంలో చాలా అవమానకరంగా మాట్లాడేవారని తెలిపాడు.

తన గురించి తెలిసి కూడా మీరేం చేస్తారు అని అడిగినప్పుడు తాను జబర్దస్త్ లో కమెడియన్ గా చేస్తున్నానని చెప్పేవాడట. అందుకు అవతల వైపు నుండి ఓ అలాగా నేను పెద్దగా టీవీ షోలు అవి చూడను అనేవారట. తర్వాత వాళ్లే జబర్దస్త్ షో కు సంబంధించిన ప్రశ్నలు అడిగేవారట. అప్పుడు అర్థమైంది అభికి కావాలనే ఇలా ప్రవర్తిస్తున్నారు అని, కానీ ఒక సందర్భంలో విక్టరీ వెంకటేష్ గారిని కలిసినప్పుడు జబర్దస్త్ బాగుంది మీ కామెడీలు చూస్తూ నవ్వుకుంటూ ఉంటాను అనడం చాలా సంతోషంగా ఉందని పేర్కొనడం జరిగింది.