అవసరాల శ్రీనివాస్ తెలుగు చలనచిత్ర నటుడిగా అందరికీ సుపరిచితమే. ఇతను స్క్రీన్ రైటర్, దర్శకుడు, టెలివిజన్ వ్యాఖ్యాత. తెలుగు సినిమాలలో తన రచనలకు ప్రసిద్ధి చెందాడు. ఇతను యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా నుండి స్క్రీన్ రైటింగ్ డిప్లమాను పొందాడు.
న్యూయార్క్ లో లీ స్ట్రాస్ బర్గ్ థియేటర్ ఇంకా ఫిలిం ఇన్స్టిట్యూట్ లో ఒక సంవత్సరం పాటు యాక్టింగ్ పై శిక్షణ పొందాడు. బ్లైండ్ అంబిషన్ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేశాడు. ఇక 2008లో వచ్చిన అష్టా చమ్మా చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమయ్యాడు.
ఈ చిత్రంలోని కొన్ని సన్నివేశాలను రాయడంలో సహాయపడ్డాడు. తరువాత వరుస సినిమాలతో మంచి గుర్తింపు పొందాడు. ఇక దర్శకుడిగా మారి ఊహలు గుసగుసలాడే అనే ప్రేమ హాస్య కథ సినిమాకు దర్శకత్వం వహించాడు. ఈ సినిమా మంచి విజయం సాధించింది.
ఆ తర్వాత దర్శకుడిగా జో అచ్యుతానంద సినిమాను చేయడం జరిగింది. ఇలా అడపాదడపాలు సినిమాలు చేస్తూ, సినిమాలలో నటిస్తూ కెరీర్లో తనదైన శైలిలో ముందుకు రాణిస్తున్న శ్రీనివాస్ గతంలో ఒక టీవీ ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ప్రస్తావన వచ్చింది.
శ్రీనివాస్ కుటుంబంలో అమ్మానాన్న, అన్నా వదినలతో కలిసి ఉన్నట్లు తెలిపాడు. ఇంకా అన్నయ్య అమెరికాలో ఉద్యోగం చేస్తున్నట్లు పేర్కొనడం జరిగింది. ఆ తర్వాత తన పెళ్లి గురించి ప్రశ్న ఎదురయింది. అందుకు తాను పెళ్లి చేసుకోవడం అంటే ఇంట్రెస్ట్ లేదని చెప్పడం జరిగింది. తన జీవితంలో ఒక కొత్త వ్యక్తిని తీసుకువచ్చి, స్ట్రిక్ట్ గా జీవితం గడపడం ఇష్టం లేదని తెలిపాడు.
పెళ్లి చేసుకోకుండా ఉంటే ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉండవు. హాయిగా సినిమాలలో నటిస్తూ లైఫ్ ఎంజాయ్ చేయొచ్చు కదా. అందుకే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని సింపుల్ గా చెప్పేశాడు. ప్రస్తుతం ఒక సినిమా తీయడానికి కథలు రెడీ చేసుకుంటున్నట్లు సమాచారం.