సుమన్ జీవితంలో మరువలేని విషాద సంఘటన ఇదేనా!

సుమన్ తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు. ఈయన పూర్తి పేరు తల్వార్ సుమన్ గౌడ్. ఈయన 1956 లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించాడు. ఈయన 1977లో నీచల్ కులం సినిమాతో సినీ రంగ ప్రవేశం చేసి, తెలుగు తమిళ, కన్నడ, ఆంగ్ల భాషలో దాదాపు 150 కి పైగా సినిమాలలో నటించాడు. సుమన్ విద్యాభ్యాసమంతా చెన్నైలో జరిగింది. ఈయన కరాటే లో బ్లాక్ బెల్ట్.

సుమన్ జీవిత వృత్తిగా కరాటే మాస్టర్ గా పనిచేసేవాడు. తన కుటుంబ స్నేహితుడు ఒక తమిళ దర్శకుడుని పరిచయం చేశాడు. తద్వారా సుమన్ సినిమా రంగంలో అడుగు వేశాడు. సుమన్ ఆంధ్ర ప్రదేశ్ కరాటే సమైక్యకు అధ్యక్షుడిగా పనిచేశాడు. ఈయన శిరీష అనే ఆమెని వివాహం చేసుకున్నాడు. వీరికి అఖిలజ ప్రత్యూష అనే అమ్మాయి సంతానం. ఈయన కెరీర్లో శ్రీరామదాసు సినిమాలో ఈయన నటించిన రాముని పాత్ర, అన్నమయ్యలో ఈయన నటించిన శ్రీ వెంకటేశ్వర స్వామి పాత్ర ఎన్నటికీ మరువలేనివి అని చెప్పుకోవచ్చు.

శివాజీ సినిమాలో ప్రతి నాయకుడిగా గొప్ప పేరు తెచ్చుకున్నాడు. 2021లో లెజెండ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సొంతం చేసుకున్నాడు. ఇలా హీరోగా అడుగు వేసి తర్వాత వివిధ పాత్రలలో నటించి తనదైన శైలిలో దూసుకుపోతున్న సుమన్ జీవితంలో మరువలేని ఒక బాధాకర, విషాద సంఘటన ఏదైనా ఉంది అంటే అది 1985లో నీలి చిత్రాల నిర్మాణం స్కామ్ లో ఇరుక్కొని జైలుకు వెళ్లడం. సడన్ గా వచ్చి పోలీసులు అరెస్టు చేసి హంతకులు, గుండాలు ఉండే డార్క్ రూమ్ లో ఉంచారు.

తన తల్లి పట్టు వదలకుండా తన కొడుకు ఏ తప్పు చేయలేదని పోరాటం చేసింది. ఆ సమయంలో జైలుకు వెళ్లిన కరుణానిధి, సుమన్ ను చూసి పోలీసులతో అతడు దోషి అని ఇంకా నిరూపించబడలేదు అతనిని ఏ కేసులు అరెస్టు చేశారు ఈ డార్క్ రూమ్ లో ఎందుకు ఉంచారో వివరణ అడగక అతనిని సాధారణ జైలుకు మార్చారు. అప్పట్లో హీరోయిన్ సుహాసిని, సుమలత ఇద్దరూ సుమన్ అటువంటి వ్యక్తి కాదని ఎవరో కావాలని ఇలా చేశారని సుమన్ కు సపోర్టుగా నిలబడ్డారు.

ఇంకా కొంతమంది సపోర్టుగా ఉండి తమిళనాడు కోర్టులో అతనికి బ్రెయిన్ వచ్చేలా తన తల్లికి అండగా నిలబడ్డారు. నాలుగు నెలల అనంతరం సుమన్ కు బెయిల్ వచ్చింది. ఇదంతా అవమానకరంగా ఫీల్ అయినా సుమన్ కొంతకాలం బయటకు రాలేదు. తరువాత హీరోగా అవకాశాలు తగ్గడంతో మిగతా పాత్రలలో కనిపించి ప్రేక్షకులను అలరించారు. ఇది తన జీవితంలో మర్చిపోలేని ఒక విషాదం.