కృతి శెట్టి తర్వాత సినిమా ఎన్టీఆర్ తోనేనా.. న్యూస్ వైరల్!

కృతి శెట్టి ఒక కన్నడ బ్యూటీ. ఈమె 2003లో కర్ణాటకలోని మంగళూరులో జన్మించింది. కృతి శెట్టి చదువుకునే రోజులలోనే కొన్ని సంస్థలకు యాడ్స్ లలో నటించింది. చదువు తర్వాత మోడలింగ్ లో అడుగు వేసింది. అప్పుడే 2019లో హృతిక్ రోషన్ హీరోగా నటించిన సూపర్ 30 సినిమాలో విద్యార్థినిగా నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమా మంచి గుర్తింపు తెచ్చింది. తర్వాత తెలుగులో అవకాశాలు వచ్చాయి.

2021లో వచ్చిన ఉప్పెన సినిమా ద్వారా హీరోయిన్ గా తెలుగు తెరకు పరిచయం అయింది. ఈ సినిమాలో తన నటన ద్వారా ప్రేక్షకుల హృదయాలను గెలుసుకుంది మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు పొందిన హీరోయిన్ల జాబితాలో చేరిపోయింది. ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర విజయం సొంతం చేసుకుంది. మంచి కలెక్షన్లు రాబట్టింది.

తరువాత 2021 లోనే వచ్చిన శ్యామ్ సింగరాయ్ సినిమాలో అవకాశం వచ్చింది. ఈ సినిమా కూడా బాక్సాఫీసును బద్దలు కొట్టింది. తరువాత 2022లో వచ్చిన బంగార్రాజు సినిమాలో హీరోయిన్ గా చేసింది. ఈ మూడు సినిమాలు మంచి విజయాలు సాధించడంతో కెరీర్ ప్రారంభంలోనే హ్యాట్రిక్ ను సొంతం చేసుకొని రికార్డు సృష్టించింది కృతి శెట్టి.

ఇలా వరుస విజయాలతో దూసుకుపోతున్న కృతి శెట్టి ఒక మీడియా ఇంటర్వ్యూలో భాగంగా తాను చేయబోతున్న సినిమాల గురించి ప్రశ్నించగా అవన్నీ రూమర్స్ అని నేను కూడా యూట్యూబ్ లో ఆ సినిమాకు సైన్ చేశాను, ఈ సినిమాకు సైన్ చేశాను అని చాలామంది నాకు తెలియకుండానే కామెంట్లు చేస్తున్నారు అని నవ్వింది.

తరువాత సినిమాలో తనకు నచ్చిన కొన్ని పాటలు, సన్నివేశాలను మీడియాతో పంచుకుంది. ఇక రీసెంట్ గా మీపై వచ్చిన రూమర్ ఏదైనా ఉందా అని ప్రశ్నించగా ఎన్టీఆర్ 30 మూవీకి సైన్ చేశానని ఈమధ్య యూట్యూబ్లో చూసాను అంది. ఇది నిజమేనా అని ప్రశ్నిస్తే లేదంటూ నవ్వుతూ సమాధానం ఇచ్చింది. ఇలాంటి రూమర్స్ పై సానుకూలంగా స్పందిస్తూ నవ్వుకుంది మన కన్నడ బ్యూటీ కృతి శెట్టి.