హీరోయిన్ చంద్రకళ సినిమాలకు దూరం కావటానికి అసలు సంగతి అదేనా!

చంద్రకళ అప్పట్లో ఈ పేరు తెలియని వారు బహుశా ఉండరేమో. ఈమె దక్షిణాది అన్ని భాషలలో నటించింది. 1950లో మంగళూరులో జన్మించింది. చిన్నప్పుడే అన్ని కళ ప్రావీణ్యం పొందింది. చిన్నప్పటినుండే సినిమాలలో నటించాలని ఆసక్తి ఉంది. అది గమనించిన తండ్రి ఆమెను ప్రోత్సహించాడు.

1963 లో కన్నడలో సినీ రంగ ప్రవేశం చేసింది. తరువాత హీరోకు చెల్లెలుగా, మరదలుగా అనేక సినిమాలలో నటించిన తర్వాత హీరోయిన్గా అవకాశాలు వచ్చాయి. ఈమె తెలుగులో, కన్నడలో ఎక్కువగా నటించింది. ఎన్టీఆర్ తో చెల్లెలి పాత్ర ద్వారా తెలుగులో రంగ ప్రవేశం చేసింది. కొన్ని సినిమాలలో అయితే ముందుగా ఈమెను ఎందుకు తీసుకున్నారు ఆ పాత్ర కు ఈమె న్యాయం చేయలేదు అనే వారితో నటించిన తర్వాత పాత్రకు బాగా సూట్ అయింది.

అని వారితోనే మెప్పించుకోవడం ఈమె అలవాటు. నటించింది తక్కువ కాలమే అయినా తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇలా సాఫీగా ముందుకు సాగుతూ అందరూ అగ్ర హీరోల చెంత ఈమె నటించింది. హిందీలో కూడా పలు అవకాశాలు వచ్చి అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఒక వ్యక్తిని ప్రేమించి రహస్య పెళ్లిని చేసుకుంది. పెళ్లి తర్వాత బాగుంటుంది అని అనుకుంటే దురదృష్టం ఆమెను వెంటాడింది. బాగా అవకాశాలు వస్తున్నప్పుడు పెళ్లి చేసుకుని తప్పక అడుగు వేసింది.

పెళ్లి అయిన సంవత్సరానికే భర్త ప్రవర్తనతో విస్తు పోయి కూతురితో ఒంటరిగా జీవనం సాగిస్తూ, ఆ బాధలో ఇక సినిమాల వైపు రాలేక అనుక్షణం నరకయాత్ర లాగా భావించి క్యాన్సర్ వ్యాధి బారిన పడింది. కొంతకాలం తర్వాత చెన్నైలోని ఒక ఆసుపత్రిలో 1999లో మరణించడం చిత్ర పరిశ్రమ జీర్ణించుకోలేకపోయింది.

ప్రస్తుతం ఆమె కూతురు చదువు కంప్లీట్ చేసి బాలీవుడ్లో నటిస్తుందని సమాచారం. మొత్తానికి పెళ్లి తర్వాత జీవితం ఇలా అయిందని ప్రేక్షకులు జీర్ణించుకోలేకపోయారు. ఇదంతా ఆమె దురదృష్టమని, ఆమె ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థించారు.