సినీ ఇండస్ట్రీపై షాకింగ్ కామెంట్స్ చేసిన హీరో ఆకాష్.. ఇంతకూ అవేటంటే?

ఆకాష్ ఒక భారతీయ నటుడు. అతను తెలుగు, తమిళ, కన్నడ భాషలలో నటించాడు. శీను వైట్ల దర్శకత్వం వహించిన, రామోజీరావు నిర్మించిన ఆనంద్ చిత్రం ద్వారా సినీ ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. మొదటి సినిమా బ్లాక్ బాస్టర్ గా నిలిచింది.

కలెక్షన్ల పరంగా, సినిమా పరంగా విజయం అందుకోవడంతో మొదటి సినిమాతోనే గుర్తింపు పొంది, స్టార్ ఎదిగాడు.ఈ సినిమా తర్వాత చాలామంది నిర్మాతలు, దర్శకులు ఈయనతో సినిమాలు చేయాలని క్యూలో ఉన్నారు. కానీ ఆకాష్ కొత్త దర్శకులతో, కష్టాల్లో ఉన్న నిర్మాతలతో సినిమాలు చేశాడు.

అయితే ఆ సినిమాలు పెద్దగా విజయాన్ని సాధించలేకపోవడంతో తిరిగి కన్నడ, తమిళ ఇండస్ట్రీలలో పలు సినిమాలలో నటించడం జరిగింది. అక్కడ కూడా ఇలాంటి పరిస్థితులు ఎదురవడంతో తెలుగు ఇండస్ట్రీలో గోరింటాకు, అందాల రాముడు, నవవసంతం సినిమాలలో సహాయ పాత్రలో నటించి మంచి గుర్తింపు పొంది తర్వాత వరుస అవకాశాలు వచ్చాయి.

ఆ తర్వాత స్వీట్ హార్ట్ అనే చిత్రానికి దర్శకత్వం వహించి అందులో నటించి మంచి విజయం సాధించాడు. ఇలా కెరీర్లో ముందుకు సాగుతున్న ఆకాష్ గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది. ఆకాశ్ ను తెలుగు సినిమాలలో ఎక్కువ కనిపించలేదు అనే ప్రశ్న ఎదురైంది.

అందుకు సమాధానంగా మొదటి సినిమానే సక్సెస్ కావడం అనేది ఇండస్ట్రీలో కొనసాగుతున్న కొంతమందికి జీర్ణించుకోలేకపోయేలా చేసింది. అందుకు కావాలని కొంతమంది తొక్కేసే ప్రయత్నం చేశారని పేర్కొనడం జరిగింది. ఇక్కడ వాడుకోవాలని చాలామంది ప్రయత్నించారు అని తెలిపాడు.

అందుకే తను తమిళ ఇండస్ట్రీలో చాలా సినిమాలు చేశాను. ఒక రకంగా అక్కడ రాణించగలుగుతున్నాను. తెలుగు ఇండస్ట్రీలో కొనసాగాలంటే సపోర్టుగా కనీసం ఒక్కరైనా ఉంటే సరిపోతుంది లేదంటే ఇక అంతే అంటూ తన మనసులోని మాటలను మీడియా ఇంటర్వ్యూ ద్వారా పేర్కొనడం జరిగింది. ఇక ప్రస్తుతం తమిళంలో ఒక సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నట్లు సమాచారం.