అల్లు అర్జున్ సోదరుడు అల్లు శిరీష్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. అల్లు కుటుంబం నుంచి వచ్చిన అల్లు శిరీష్ ఎలా అయినా హీరోగా నిలదొక్కుకోవాలని అనేక ప్రయత్నాలు చేస్తున్నారు. అల్లు వారి చిన్నబ్బాయి అల్లు శిరీష్ ఇంకా హిట్ కోసం పోరాడుతూనే ఉన్నాడు. తన తండ్రి ప్రొడక్షన్ హౌస్ ద్వారా అనేక సినిమాలతో ప్రయోగాలు చేసిన అల్లు శిరీష్ చాలా కాలం నుంచి సైలెంట్ గా ఉన్నాడు.
దాదాపు మూడేళ్లు సినిమాలకు గ్యాప్ ఇచ్చిన శిరీష్.. ప్రస్తుతం ఉర్వశివో రాక్షసివో అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు నిర్మాతలు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ సినిమాలో అల్లు శిరీష్ సరసన అను ఇమ్మానియేల్ హీరోయిన్ గా నటించింది. విజేత అంటూ కళ్యాణ్ దేవ్ ని హీరోగా పరిచయం చేసిన రాకేష్ శశి ఈ సినిమాకు డైరెక్షన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు. నవంబర్ 4వ తేదీన ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు రాబోతోంది సినిమా యూనిట్. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన టీజర్, సాంగ్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి.
ఈ సందర్భంగా ఈ సినిమాకి సంబంధించిన ప్రమోషన్స్ లో పాల్గొంటున్న అల్లు శిరీష్ తాజాగా తన జీవితంలో ఉన్న బ్రేకప్ గురించి బయట పెట్టాడు. తన ఒరిజినల్ బ్రేకప్స్ గురించి నోరు విప్పాడు. తనకు మూడు సార్లు బ్రేకప్ అయ్యిందని, దానివలన తాను ఎంతో కుంగిపోయినట్లు కూడా చెప్పుకొచ్చాడు.
తాజాగా ఒక యూట్యూబ్ ఇంటర్వ్యూలో సదరు యాంకర్ మీ జీవితంలో బ్రేకప్ గురించి చెప్పాలని అడిగితే తన జీవితంలో చాలా బ్రేక్ అప్స్ ఉన్నాయని ముఖ్యంగా రెండు మూడు బాగా పెద్ద బ్రేకప్స్ అయ్యాయి అని చెప్పుకొచ్చారు. వారితో చాలా క్లోజ్ అయిన తర్వాత బ్రేకప్ అయిందని, ఈ సందర్భంగా అల్లు శిరీష్ పేర్కొన్నారు.
నిజ జీవితంలో మీ రిలేషన్స్ గురించి చెప్పండి అన్న ప్రశ్నకు శిరీష్ మాట్లాడుతూ ఈ కాలంలో రిలేషన్స్ లేకుండా ఎవరుంటారు.. అతనికి కూడా అలానే రెండు మూడు రిలేషన్స్ ఉన్నాయనీ.. బ్రేకప్ కూడా అయ్యాయనీ తెలిపాడు. వాటి వలన నేను కూడా బాధపడ్డాను.. బ్రేకప్ చెప్తే ఎదుటి వాళ్లు భాద పడతారని అందుకుంటారు.. కానీ బ్రేకప్ చెప్పినవాళ్లు కూడా బాధపడతారు.. కానీ వెంటనే కాదు.. ఒక ఏడాది లో వారికి ఆ బాధ రెట్టింపు అవుతోంది.
అయితే ఒక పెద్దింటి అమ్మాయి మంచి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయితో కూడా బ్రేకప్ అయిందట కదా అని అడిగితే అవునని ఆమెకు తానే బ్రేకప్ చెప్పానని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. అయితే ఎప్పుడైనా మీరు ఈ విషయంలో బాధపడ్డారా అని అడిగితే బాధపడ్డాను అని చెప్పుకొచ్చారు అల్లు శిరీష్. ఈ పాటికి అంతా బాగుండి ఉంటే ఆమెను పెళ్లి చేసుకుంటే అతనికి కూడా అర్హ, అయాన్ లాగా ఇద్దరు పిల్లలు తిరుగుతూ ఉండేవారనీ చెప్పుకుని బాధపడ్డారు.
అంటే తనకు కూడా అప్పుడప్పుడు అదే అనిపిస్తుందని అనవసరంగా బ్రేకప్ చెప్పుకొని టైం వేస్ట్ చేస్తున్నానేమో అని అనిపిస్తుందని ఈ సందర్భంగా అల్లు శిరీష్ చెప్పుకొచ్చాడు. మొత్తం మీద అల్లు శిరీష్ చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో మాత్రం హాట్ టాపిక్ గా మారుతున్నాయి.