నటుడు రవిశంకర్ గురించి ఎవరికీ తెలియని నిజాలు.. ఏంటో తెలుసా?

రవిశంకర్ నటుడిగానే కాకుండా డబ్బింగ్ ఆర్టిస్టుగా అందరికీ సుపరిచిత వ్యక్తి. ఈయనను చూస్తే మొదటగా వదలను బొమ్మాలి అనే డైలాగ్ గుర్తుకు వస్తుంది. అరుంధతి సినిమాలో సోను సూద్ కు డబ్బింగ్ చెప్పింది ఈయనే. 1996లో నటుడు పీజే శర్మకు మద్రాస్ లో జన్మించాడు. ఈయన సోదరుడు సాయికుమార్ అందరికీ సుపరిచితుడే. వీరిది మొదట విజయనగరం అయితే పీజె శర్మగారు నాటకాలలో నటించేవారు.

ఏఎన్ఆర్ గారు ఉత్తరం రాశారు అనుకొని మద్రాసు వెళ్లి ఆయనను కలిసే ప్రయత్నం చేశారు కుదరలేదు. సినిమా అవకాశాల కోసం తిరుగుతూ ఏఎన్ఆర్ సినిమాలో జూనియర్ ఆర్టిస్టుగా అవకాశం వస్తే అప్పుడు ఏఎన్ఆర్ దృష్టిలో పడాలని ఎంతగానో ప్రయత్నించారు. చివరికి ఏఎన్నార్ గారు చూసి నువ్వు నాతో మాట్లాడాలని అనుకుంటున్నావా అంటూ అడిగితే ఉత్తరం ఇస్తే సంతకం మాత్రమే నేను చేశాను ఇది ఎవరో రాసి నీకు పంపించారు అంటారు ఏఎన్ఆర్.

సరే మీ వాయిస్ బాగుంది మీరు సినిమా అవకాశాల కంటే డబ్బింగ్ ఆర్టిస్టుగా అయితే రాణించగలుగుతారు అని కాస్త ప్రోత్సహిస్తాడు. అలా పీజే శర్మ గారు మద్రాసులో స్థిరపడి పలు సినిమాలలో నటించడం డబ్బింగ్ ఆర్టిస్టుగా రాణించారు. రవిశంకర్ గారు మంచి హైట్ గా ఉండటం వల్ల ఆయన తల్లి హీరో చేయాలని చిన్నప్పుడే భరతనాట్యం కూచిపూడి లాంటివి అన్నీ నేర్పించింది. అన్ని కళ లలో ప్రావీణ్యం పొందాడు.

బాల నటుడిగా పలు చిత్రాల్లో నటించి తరువాత వాయిస్ బాగుందని డబ్బింగ్ అవకాశాలు వచ్చాయి. దాదాపు 3700 సినిమాలకు డబ్బింగ్ చెప్పి రికార్డు సృష్టించాడు. డబ్బింగ్ ఆర్టిస్టుగా ఏడు అవార్డులు సొంతం చేసుకున్నాడు. సినిమాలలో వచ్చే అవకాశాల వల్ల గుర్తింపు అంతగా లేదని డబ్బింగ్ ఆర్టిస్టుగా కొనసాగుతుంటే తల్లి మరణం తర్వాత సాయికుమార్ గారు డైరీలో రవి హీరో కావాలి అని రాసుకున్న విషయం చెప్తే రవిశంకర్ డబ్బింగ్ గా చేస్తూ సినిమాలలో నటించడానికి సెకండ్ ఇన్నింగ్ ప్రారంభించాడు.