నటుడు చలపతిరావు గురించి ఈ నమ్మలేని నిజాలు తెలుసా?

చలపతిరావు సుప్రసిద్ధ తెలుగు సినీ నటుడు. ఈయన 1200 సినిమాలలో పాలు రకాల పాత్రలలో నటించాడు. 1944లో కృష్ణాజిల్లాలోని బల్లిపర్రు గ్రామంలో జన్మించాడు. చిన్నప్పటినుండి ఉన్నత చదువులు చదవాలని ఇంట్లో కుటుంబ సభ్యులు, బంధువులు ఎంతో ప్రోత్సహించారు.

కానీ చదువు అబ్బక ఒకసారి నాటకంలో ప్రదర్శన చేస్తే హీరోలా ఉన్నావు సినిమాలలో ట్రై చేస్తే రాణించగలవు అని స్నేహితులు ప్రోత్సహించారు. తన స్నేహితురాలిని ప్రేమించి, ఎవరికి తెలియకుండా వివాహం చేసుకున్నాడు. అప్పటికి ఆయన వయసు 19 సంవత్సరాలు. ఇక పెళ్లి అయ్యాక చెన్నై వెళ్లి అవకాశాల కోసం ప్రయత్నాలు చేస్తే అర్థమయింది.

ఒక్క అవకాశం సంపాదించడం ఎంత కష్టమో, ఒకచోట షూటింగ్ జరుగుతుంటే అక్కడ ఎన్టీఆర్ గారిని చూసి అందరూ వెళ్లాక కలిసి ఒక్క అవకాశం ఇప్పించగలరా అని అడిగితే కష్టం మీరు మీ ఊరికి వెళ్లిపోండి అన్నారు ఎన్టీఆర్ గారు. తిరిగి వారం తర్వాత ఇంటికి వెళ్లి కలిస్తే నువ్వు చాలా మొండి వాడిలా ఉన్నావు అంటే అవునండి ఇంత దూరం వచ్చాను కదా నటించకుండా వెళితే బాగుండదు అనిపిస్తుంది అన్నాడు.

అప్పుడు డైరెక్టర్ తో చెప్పి ఒక చిన్న అవకాశం ఇప్పిస్తే ఆ తర్వాత ఎన్టీఆర్ గారు నటించే చాలా సినిమాలలో విలన్ గా అవకాశాలు వస్తే నటించడం జరిగింది. ఆ తర్వాత వరుస అవకాశాలతో దూసుకుపోవడం జరిగింది. ఈయనకు 29 సంవత్సరాలు రాగానే భార్య చనిపోయింది. ఈయనకు ఇద్దరు కూతుర్లు ఒక కుమారుడు సంతానం. అప్పటినుంచి ఈయన వివాహం చేసుకోలేదు. ఎన్టీఆర్ గారు కూడా ఒకసారి చివరి రోజుల్లో కష్టమవుతుంది అంటే వినలేదు.

పిల్లలను బాగా చదివించి అమ్మాయిలను ఫారిన్లో సెటిల్ చేశారు అబ్బాయి ఇక్కడే స్థిరపడ్డాడు అందరికీ పెళ్లిళ్లు చేశాడు. అంతా కలిసినప్పుడు సొంత ఊరు బల్లిపర్రు వెళ్లి రెండు మూడు రోజులు గడుపుతారు. అయితే ఒకసారి సోషల్ మీడియాలో తనపై వచ్చిన తప్పుడు వార్తను చూసి ఆత్మహత్య చేసుకోవాలి అనుకున్నాడు.

ఆడవారు అంటే అపారమైన గౌరవం ఉందని, భార్య చనిపోయిన కూడా వివాహం చేసుకోలేదు అటువంటి నేను ఆడవాళ్లను అగౌరవంగా ఎందుకు చూస్తాను అంటూ వాపోయాడు. ప్రస్తుతం హైదరాబాదులో పిల్లలతో కాకుండా ఒంటరిగా జీవిస్తున్నట్లు సమాచారం.