తనికెళ్ళ భరణి తెలుగు సినిమా నటుడిగా అందరికీ సుపరిచితమే. ఈయన రంగస్థల నటుడు, సినిమా రచయిత, సకల కళాకోవిదుడు. ఇతనికి దర్శకుడు వంశీ మంచి స్నేహితుడు. ఈయన కంచుకవచం చిత్రానికి రచయితగా, నటుడిగా తెలుగు తెరకు పరిచయం అయ్యాడు.
తరువాత లేడీస్ టైలర్ చిత్రానికి మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. ఈయన తెలంగాణ యాసలో సినిమా మాటలు రాయడంలో చాలా ప్రసిద్ధుడు. ఈయన తెలుగులో హాస్యపాత్రలో నటిస్తూ దాదాపు 320కి పైగా చిత్రాలలో నటించడం జరిగింది. ఇలా తన కెరీర్లో రచయితగా, నటుడిగా బిజీగా రాణిస్తున్న తనికెళ్ళ భరణి గతంలో ఒక ఇంటర్వ్యూలో పాల్గొనడం జరిగింది.
ఆ ఇంటర్వ్యూలో తనికెళ్ళ భరణిని బయటివారు ఎక్కువగా తెలుగు ఇండస్ట్రీకి రావడం పై మీ అభిప్రాయం ఏంటి అనే ప్రశ్న ఎదురయింది. దానికి సమాధానంగా తమిళ ఇండస్ట్రీ వాళ్లకు ఒక యూనిటీ ఉంది బయట వారికి రెండు లేదా మూడు సినిమాలలో మాత్రమే అవకాశాలు ఇస్తారు. ఎక్కువ ప్రాధాన్యత వాళ్ల ప్రాంతం వారికి ఉంటుంది అని తెలిపాడు.
ఇక తెలుగు ఇండస్ట్రీలో బయట వాళ్లకే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఇక్కడ ఉన్న వాళ్లకు అవకాశాలు తగ్గడం ఒకరకంగా వాస్తవమే కానీ మన తెలుగువాళ్లు బయటకు వెళ్లాలి అనే ఆలోచన చాలా తక్కువగా ఉంటుంది. మనవాళ్లు కూడా బయట ఇండస్ట్రీలకు వెళ్లడం ద్వారా మంచి అవకాశాలు పొందవచ్చు.
ఈమధ్య ఐటీ ఇండస్ట్రీ రావడం చేత కాస్త మనవాళ్లు కూడా విదేశాలు అంటూ బయటకు రావడం జరుగుతుంది. ఇలా బయటికి వెళ్తేనే కదా అవకాశాలు అనేటివి కాస్త ఎక్కువగా వచ్చే అవకాశం ఉంది. అందరూ ఒకే చోట ఉంటే అవకాశం అనేది కొందరికే లభిస్తుంది అని చెప్పడం జరిగింది. బయటి వాళ్లు మన ఇండస్ట్రీకి వచ్చి చక్కగా తెలుగు నేర్చుకుని సెటిలైపోతున్నారు.
వాళ్ల నటనకు వాళ్లే డబ్బింగ్ కూడా చెప్పుకుంటున్నారు. కానీ మన వాళ్లు బయటకు వెళ్లడమే తక్కువ, ఇక డబ్బింగ్ గురించి చెప్పాల్సిన అవసరం లేదు. ఏదైనా సాధించాలి అనే పట్టుదల ఉంటే ఎక్కడైనా కూడా రాణించవచ్చు అని ఇంటర్వ్యూ ద్వారా పేర్కొనడం జరిగింది.