టాలీవుడ్ లో హీరో సాయి ధరమ్ తేజ్ పై కుట్ర.. అసలేం జరుగుతుందంటే?

సాయి ధరమ్ తేజ్ తెలుగు సినీ నటుడు. చిరంజీవి మేనల్లుడు గా అందరికీ సుపరిచితమే. ఇతను వై. వి. ఎస్. చౌదరి దర్శకత్వం వహించిన రేయ్ సినిమాలో మొదట నటించినప్పటికీ.. పిల్లా నువ్వు లేని జీవితం అనే సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు.

ఆ తర్వాత సుబ్రహ్మణ్యం ఫర్ సేల్, సుప్రీమ్, తిక్క, విన్నర్ వంటి వరుస సినిమాలతో ముందుకు దూసుకుపోతూ తనకంటూ ఇండస్ట్రీలో ఒక ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్నాడు. కానీ కెరీర్ ప్రారంభంలో వరుసగా మూడు హిట్లు కొట్టిన సాయి ఆ తర్వాత వరుస ప్లాపులను అందుకుంటూ ఉన్నాడు.

ఇక సాయిధరమ్ తేజ్ ను ఇండస్ట్రీలో ఎవరైనా తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా అంటే అవుననే వార్తలు వినిపిస్తున్నాయి. సాయి మామూలుగా ఎక్కడికి వెళ్లినా యాటిట్యూడ్ చూపించడు. తన పని ఎంతో అంతవరకే, మంచి అలవాట్లు, వ్యక్తిత్వం ఉన్న వ్యక్తిగా ఇండస్ట్రీలో అందరూ చెప్పుకుంటారు.

అయితే ఈ హీరోకు మొదట చేయూతనిచ్చిన వారే ప్రస్తుతం తొక్కేయాలని ప్రయత్నాలు చేస్తున్నారట అనే వార్తలు వినిపిస్తున్నాయి. కొందరు బడా నిర్మాతలు ఈ హీరో వద్దకు మంచి కథలు వెళ్లకుండా చేస్తున్నారని, ఆ హీరో దగ్గర ఏం జరిగినా వీళ్ళు పసిగట్టి ఆ సినిమాలను దూరం చేస్తున్నాయని కథనాలు గట్టిగానే వినిపిస్తున్నాయి.

మరి ఇలాంటి పరిస్థితులలో ఈ హీరోను పవన్ కళ్యాణ్ మాత్రమే ఆదుకోగలడు అనే వార్తలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఇక నాగబాబు, వరుణ్ తేజ్ ను స్టార్ గా నిలబెట్టే ప్రయత్నంలో ఉన్నాడు అని అందరికీ తెలిసిందే. మరొకవైపు చిరంజీవి రాజకీయపరంగా, చరణ్ చేసే సినిమా కథల పరంగా, కొన్ని బిజినెస్ వ్యవహారాలపరంగా బిజీగా ఉన్న విషయం కూడా తెలిసిందే.

ఇక తెలుగు ఇండస్ట్రీలో సాయిని ఒక్క పవన్ కళ్యాణ్ మాత్రమే ఆదుకునే పరిస్థితులు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది.