బిత్తిరి సత్తి టీవీ వ్యాఖ్యతగా అందరికీ సుపరిచితమే. తెలుగు సినిమాలలో నటుడుగా కూడా రాణిస్తున్నాడు. ఇతని అసలు పేరు కావలి రవికుమార్. ఇటీవలే కాలంలో సినిమా విడుదలకు ముందు నటీనటులను ఇంటర్వ్యూ చేయడం ద్వారా పాపులర్ అయ్యాడు.
తెలంగాణ యాసలో తాను మాట్లాడే మాటలకు బాగా ప్రసిద్ధి చెందాడు. సినిమాలలో నటించాలి అని ఆసక్తితో 2003లో హైదరాబాద్ వచ్చాడు. తమ్మారెడ్డి భరద్వాజ దగ్గర అసిస్టెంట్ మేనేజర్ గా చేయడం జరిగింది. తర్వాత 2005లో డబ్బింగ్ ఆర్టిస్టుగా మారి దాదాపుగా 150 సినిమాలలో డబ్బింగ్ చెప్పడం జరిగింది.
2007లో అల్లరి నరేష్ నటించిన సీమశాస్త్రి సినిమాలో ఒక చిన్న పాత్ర ద్వారా తెలుగు ఇండస్ట్రీకి పరిచయమయ్యాడు. 2012 లో జీ తెలుగులో ప్రసారమైన కామెడీ క్లబ్ అనే రియాల్టీ షోలో పాల్గొనడం జరిగింది. ఆ తరువాత జర్నలిజం మీద ఆసక్తితో శిక్షణ పొంది 2015లో వి6 ఛానల్ లో తీన్మార్ వార్తల సమాచారాన్ని ఇచ్చేవాడు.
ఈ తీన్మార్ వార్తల వల్ల తనకు మాత్రమే గుర్తింపు కాకుండా.. వి6 ఛానల్ కి రేటింగ్ కూడా బాగా పెరిగింది. ఇక 2019లో హీరోగా మారి తుపాకి రాముడు సినిమాలో నటించడం జరిగింది. ఇటీవల కాలంలో ఏ సినిమా వచ్చిన విడుదలకు ముందు ఆ సినిమా నటీనటులను ఇంటర్వ్యూ చేయడం వల్ల బాగా పాపులర్ అయ్యాడు.
ఇక అసలు విషయం ఏమిటంటే బిత్తిరి సత్తి విజయదశమి రోజున దాదాపు 2.5 కోట్లతో రేంజ్ రోవర్ కారును కొనుగోలు చేసినట్లు తెలుస్తుంది. దానికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టడం ద్వారా ప్రస్తుతం టాలీవుడ్ లో ఇది హాట్ టాపిక్ గా మారింది.
బిత్తిరి సత్తి ఇంత ఖరీదు కారు కొన్నాడు అంటే అతని ఆదాయం నెలకు లక్షల్లో ఉంటుందంటే ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదంటూ సోషల్ మీడియాలో వార్తలు గట్టిగానే వినిపిస్తున్నాయి.
ఇక ఈ 2022 సంవత్సరంలో కోతల రాయుడు సినిమాలో నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం బిత్తిరి సత్తి టీవీ9 వార్త ఛానల్ లో ఇస్మార్ట్ న్యూస్ కార్యక్రమంలో వ్యాఖ్యతగా పనిచేస్తూ.. బిజీగా ఉన్నట్లు తెలుస్తుంది.