తెలంగాణ పీసీసీ అధ్యక్ష పదవి కోసం చాలామంది నేతలే క్యూలో ఉన్నా… తెలంగాణలో కాస్తో కూస్తో పార్టీ పరువును కాపాడుతున్న అతికొద్ది మంది నాయకుల్లో రేవంత్ రెడ్డి ఒకరు. తన సొంత నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఓడిపోయినా.. ఎంపీగా గెలిచి చరిత్ర సృష్టించారు రేవంత్. అందులోనూ ఆయనకు దూకుడెక్కువ. ఎవ్వరినీ పట్టించుకోడు. అధికార పార్టీపై విమర్శలు గుప్పించడంలో దిట్ట.
అందులోనూ రేవంత్ రెడ్డికి పీసీసీ అధ్యక్ష పీఠంపై ఎప్పటి నుంచో కన్ను ఉంది. కాంగ్రెస్ డిల్లీ అధిష్టానం త్వరలోనే రేవంత్ కి PCC పదవి ఇస్తుంది అనీ అంతే కాకుండా ముఖ్యమంత్రి అభ్యర్ధిగా కూడా ప్రకటిస్తుంది అని చాలామంది అంటున్నారు. అలా చేయడం వల్ల కేసిఆర్ పాలన కి చెక్ పెట్టాలి అనీ, రానున్న ఎన్నికల్లో టిఆర్‌ఎస్ ని చిత్తు చేయాలి అనీ సోనియా ప్లానింగ్ లు వేస్తున్నారు అన్నట్టుగా మాటలు వినపడుతున్నాయి.
మా “తెలుగు రాజ్యం” సైట్‌లోకి వెళ్లి ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, ఓటు రూపకంలో మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”8″]