అమరావతిలో శాసన రాజధాని కూడా ఉండటానికి వీల్లేదంటూ బాంబు పేల్చిన మంత్రి కొడాలి నాని ఇదే విషయమై తన మాటల యుద్దం మరింత ముమ్మరం చేశారు. అమరావతి విషయంలో తాను చెప్పినట్లు చేస్తే రాజీనామా చేసేందుకు సైతం సిద్దమని సవాలు విసిరారు. తద్వారా అమరావతిపై అమీతుమీ తేల్చుకునేంత వరకు తాను ఈ విషయాన్ని వదిలేదిలేదని వారికి హెచ్చరికలు చేసినట్లయింది.
అయితే అమరావతి విషయంలో ఉద్యమాలు, న్యాయపోరాటాలు చేస్తున్న భూములు ఇచ్చిన రైతుల విషయంలో మీకు అన్యాయం జరగదంటూ ఇటీవలి వరకు నచ్చచెప్పే ధోరణిలో ముందుకు వెళ్లిన వైసిపి ఇప్పుడు రూటు మార్చిందేమోనన్న అభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. “తెలుగు రాజ్యం” ప్రత్యేక ప్రజాభిప్రాయ సేకరణలో పాల్గొని, మీ అభిప్రాయం చెప్పండి.
[poll id=”2″]