వైవిఎస్ చౌదరి.. ఈసారి తెలుగు అమ్మాయితోనే

YVS Chowdary to introduce new telugu heroine
YVS Chowdary to introduce new telugu heroine
వైవిఎస్ చౌదరి.. ఎన్టీఆర్ వీరాభిమాని.  ఆయన స్ఫూర్తితోనే ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు.  ‘సీతారాముల కళ్యాణం చూతము రారండి, సీతారామరాజు, యువరాజు, లాహిరి లాహిరి లాహిరిలో, సీతయ్య, దేవదాసు, ఒక్కమగాడు, సలీం, నిప్పు, రేయ్‌’ వంటి చిత్రాలను డైరెక్ట్ చేశారు.  కానీ గత నాలుగు చిత్రాలు ఫ్లాప్ కావడంతో లాంగ్ గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది ఆయన.  మళ్లీ ఇన్నేళ్లకు ఆయన సినిమా తీయడానికి రెడీ అవుతున్నారు.  కథ సిద్ధం చేసుకుని ఏర్పాట్లన్నీ పూర్తి చేసుకున్నారు.  పరిస్థితులు మెరుగుపడ్డాక షూటింగ్ మొదలుపెడతారట.  
 
ఈసారి ఆయన చేయబోయే సినిమాలో ఒక తెలుగు అమ్మాయినే హీరోయిన్ గా పరిచయం చేయనున్నారట.  గతంలో వచ్చినట్టు ఇప్పుడు తెలుగు అమ్మాయిలు హీరోయిన్లుగా రాలేకపోతున్నారని, వచ్చినా సరైన లాంచింగ్ లేక నిలదొక్కుకోలేకపోతున్నారన్న వైవిఎస్ చౌదరి ఈసారి తన సినిమాలో అందరూ కొత్త వాళ్లేనని అంటున్నారు. అంతేకాదు మంచి సినిమాలు తీయాలని అనుకోవడం వల్లనే సినిమా సినిమాకు గ్యాప్ తీసుకోవాల్సి వస్తుందిని, అన్నీ కలిసొస్తే ఎన్టీఆర్, మహేష్ బాబులతో సినిమాలు చేయాలని ఉందని అన్నారు.  మరి చాలా కాలం తర్వాత వస్తున్న వైవిఎస్ చౌదరి ప్రయత్నాలు, ఆశలు ఫలిస్తాయేమో చూడాలి.