ఆంధ్రప్రదేశ్ లో కరోనా వైరస్ మహమ్మారి జోరు ఏ మాత్రం తగ్గడం లేదు. ప్రతి రోజు కూడా కరోనా మహమ్మారి కేసులు వెలుగులోకి వస్తూనే ఉన్నాయి.
కరోనా వైరస్ బారినపడి కోలుకున్నవారికి మరోమారు వైరస్ సోకడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఏపీలో ఇలాంటివి పలు కేసు నమోదైన సంగతి తెలిసిందే.
తాజాగా వైఎస్సార్‌సీపీ అధికార ప్రతినిధి, సత్తెనపల్లి ఎమ్మెల్యే అంబటి రాంబాబుకు మళ్లీ రెండోసారి కరోనా పాజిటివ్ గా తేలింది. ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. గత జులైలో తనకు కొవిడ్ సోకిందని.. కొన్నిరోజులకే కోలుకున్నానని తెలిపారు. నిన్న అసెంబ్లీలో మరోసారి నిర్వహించిన కరోనా టెస్టులో పాజిటివ్ గా నిర్ధారణ అయ్యిందని వెల్లడించారు. రీ ఇన్ఫెక్షన్‌కి గురికావడం ఆశ్చర్యాన్ని కలిగించిందని మీ ఆశీస్సులతో కరోనాని మరోసారి జయించి మీ ముందుకి వస్తాను అని అంబటి రాంబాబు పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే … ఇటీవల జరిగిన ఏపీ అసెంబ్లీ సమావేశాలకు కూడా అంబటి రాంబాబు హాజరైన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన పలువురు ఎమ్మెల్యేలు, మంత్రులను కలిశారు. ఇప్పుడు అంబటి రాంబాబుకి కరోనా పాజిటివ్ అని తేలియడంతో.. ఆయనను కలిసిన వారిలో ఆందోళన నెలకొన్నట్టుగా తెలుస్తుంది. వారు టెస్టులు చేయించుకోవాలని భావిస్తున్నట్టుగా తెలుస్తోంది.