Perni Nani: జనసేన పార్టీ అద్దెకిచ్చే టెంట్ హౌస్ లాంటిది… పవన్ కు ఇచ్చి పడేసిన పేర్ని నాని?

Perni Nani: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇటీవల ఓ సభలో వైసీపీ పై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే. 2029లో అధికారంలోకి వస్తామంటూ వైసీపీ నాయకులు తెగ రెచ్చిపోతున్నారు. అయితే వారు 2029 లో ఎలా అధికారంలోకి ఎలా వస్తారో నేను చూస్తాను వారిని అధికారంలోకి రానివ్వను అంటూ ఇటీవల పవన్ కళ్యాణ్ సీరియస్ వార్నింగ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే పవన్ చేసిన ఈ వ్యాఖ్యలపై మాజీ మంత్రి పేర్ని నాని స్పందిస్తూ పవన్ కు తనదైన శైలిలోనే కౌంటర్ ఇచ్చారు.

రాష్ట్రవ్యాప్తంగా టిడిపి సైకో బ్యాచ్ రెచ్చిపోయి అరాచకాలు సృష్టిస్తుంది. కానీ అధికార మదంతో ఈ దాడులు ఎవరికి కనిపించలేదని నాని తెలిపారు. గుంటూరు జిల్లా మన్నవ గ్రామ సర్పంచ్‌ నాగమల్లేశ్వర రావు పై పట్టపగలు నడిరోడ్డుపై టీడీపీ గుండాలు అత్యంత కిరాతకంగా చేసిన దాడిని చూసి మొత్తం రాష్ట్రం అంతా ఉలిక్కిపడిందని అన్నారు. ఇలా కూటమి కార్యకర్తలు రక్తపాతం సృష్టిస్తుంటే నేతలు ప్రోత్సహిస్తున్నారని నాని విమర్శలు కురిపించారు. జగన్మోహన్ రెడ్డిని మళ్లీ రానివ్వను అని చెప్పడానికి పవన్ కళ్యాణ్ ఎవరు అంటూ ప్రశ్నించారు.

వచ్చే ఎన్నికలలో అధికారంలోకి ఎవరు రావాలి ఎవరు లేరు అని నిర్ణయించేది ప్రజలేనని తెలిపారు. జగన్ గురించి మాట్లాడే స్థాయి పవన్ కళ్యాణ్ కు లేదని ఆయన చంద్రబాబు నాయుడుకు హాని జరిగినప్పుడు తప్ప బయటకు వచ్చి మాట్లాడిన సందర్భాలు లేవని తెలిపారు. ఇక భవిష్యత్తులో పవన్ కళ్యాణ్ ను కలవాలి అంటే పక్క రాష్ట్రంలో షూటింగ్ జరుగుతున్న ప్రాంతం వెళ్లి కలవాల్సిందేనని తెలిపారు.జగన్ మళ్లీ రావాలా వద్దా అనేది నిర్ణయాల్సింది ప్రజలే తప్ప పవన్ కళ్యాణ్‌, చంద్రబాబు కాదన్నారు. మళ్లీ ఈవీఎంలను మేనేజ్ చేసి గెలవచ్చనే ధైర్యంతోనే జగన్‌ని అధికారంలోకి రానివ్వనని చెబుతున్నాడని బయట మాట్లాడుకుంటున్నారని వివరించారు. ఇక జనసేన పార్టీ గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఆ పార్టీ అద్దెకు ఇచ్చే ఒక టెంట్ హౌస్ లాంటిది అంటూ విమర్శలు కురిపించారు.సొంతంగా గెలవలేక అందరూ ఒక్కటై ప్రజలను దోచుకుంటున్నారని మండిపడ్డారు. ఎన్నికలకు ముందు అదిచేస్తాం.. ఇది చేస్తామంటూ హడావిడి చేసిన కూటమి నేతలు ఎన్నికల తర్వాత అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇచ్చిన హామీలు ఎక్కడ అంటూ ప్రశ్నించారు.