AP: అధికారంలోకి వస్తే రప్పా రప్పా నరుకుతాం.. సంచలనంగా మారిన వైసీపీ ఫ్లెక్సీలు!

AP: ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుంది అయితే ఈ ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకత ఏర్పడిందా అంటే పలు సర్వేలు అవునని చెబుతున్నాయి. అంతేకాకుండా జగన్మోహన్ రెడ్డి బయటకు వస్తే చాలు ఆయన వెంట సునామి కనిపిస్తున్న నేపథ్యంలో ఏడాది కాలంలోనే కూటమి ప్రభుత్వానికి ఇంత వ్యతిరేకత అంటూ అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే నిజంగానే జగన్మోహన్ రెడ్డి పై సానుకూలత పెరిగి ఇలా జనాలు తరలి వస్తున్నారా లేదా అనే సందేహంలో అందరూ ఉన్నారు. ఇకపోతే నిన్న జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గ రెంటపాళ్లలో మృతి చెందిన వైసిపి నేత కుటుంబాన్ని పరామర్శించడానికి వెళ్లారు.

ఇక ఈ పల్నాడు నియోజకవర్గంలో జగన్ పర్యటనకు పోలీసుల నుంచి అనుమతి లేదు అలాగే ఎన్నో ఆంక్షలు పెట్టారు అయినప్పటికీ జగన్మోహన్ రెడ్డి తన పర్యటనను వాయిదా వేసుకోలేదు. ఇక జగన్మోహన్ రెడ్డి వస్తున్నారనే నేపథ్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు కూడా తరలివచ్చారు. ఇక ఈ పర్యటనలో భాగంగా వైసిపి కార్యకర్తలు పట్టుకున్న ఫ్లెక్సీలు ప్రస్తుతం ధమారం రేపుతున్నాయి.మంత్రి నారా లోకేష్ కూడా వాటిని ప్రస్తావిస్తూ యథా అధినేత తథా నాయకులు అని కామెంట్స్ చేశారు..

2029 ఎన్నికలలో కచ్చితంగా జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వస్తారని,ఫలితాలు వచ్చినప్పటి నుంచే టీడీపీ నేతల పని పడతామని కార్యకర్తలు పోస్టర్లు ప్రదర్శిస్తున్నారు. గంగమ్మ తల్లి జాతరలో వేట తలలు నరికినట్టు రప్పా రప్పా నరుకుతాం ఒక్కొక్కడ్నీ అంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ఫ్లెక్సీలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో టిడిపి నేతలు ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ ఫ్లెక్సీ పట్టుకున్న రవితేజ అనే కార్యకర్తను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఈ విషయం కాస్త సంచలనగా మారింది.