Y.S.Jagan: పొత్తు ఆలోచనలో వైసీపీ.. పొత్తు లేకుంటే అధికారం కష్టమేనా.. జగన్ అనూహ్య నిర్ణయం?

Y.S.Jagan: వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు అయినప్పటి నుంచి కూడా ఎన్నో కష్టాలని ఎదుర్కొన్న ఇబ్బందులను ఎదుర్కొన్న ఇప్పటివరకు ఎన్నికలలో కేవలం సింగిల్గానే పోటీ చేస్తూ వచ్చారు. తాము ఏ పార్టీతో పొత్తు పెట్టుకోమని, సింహం సింగిల్ గా వస్తుంది అంటూ పార్టీ నాయకులూ కూడా ఒకానొక సమయంలో ఓ రేంజ్ లో ఊదరగొట్టారు. అయితే అది 2024 ఎన్నికలకు ముందు కానీ ఇప్పుడు మాత్రం వైసిపి నేతలతో పాటు వైసిపి నాయకుడు ఆలోచన కూడా మారిందని స్పష్టం అవుతుంది. తిరిగి జగన్ ముఖ్యమంత్రి కావాలన్నా వైసీపీ అధికారంలోకి రావాలన్న పొత్తు తప్పదు అనే ఆలోచనలో ఉన్నారని తెలుస్తోంది.

2024 ఎన్నికలకు ముందు బిజెపి తెలుగుదేశం పార్టీ జనసేన ఈ మూడు పార్టీలు పొత్తు పెట్టుకుని జగన్మోహన్ రెడ్డిని చిత్తుచిత్తుగా ఓడించాయి. అయితే ఈ పొత్తును జగన్ చాలా లైట్ గా తీసుకున్నప్పటికీ తెర వెనక మాత్రం పొత్తు లేకుండా ఉండడం కోసం విశ్వ ప్రయత్నాలు చేసిన కుదరలేదు. అయితే కూటమి ఏర్పాటు అయిన ప్రతిసారి జగన్ ఓటమిపాలు అవుతున్నారు. ఆ మూడు పార్టీలు కలిసి ఉన్న పరిస్థితి ఉంటే.. అది జగన్‌కు ఎప్పుడూ ఎఫెక్ట్ చూపిస్తూనే ఉంది. దీంతో వైసీపీ తన వ్యూహం మార్చిందనే చెప్పాలి.

పార్టీని అధికారంలోకి తీసుకువచ్చేందుకు ఎత్తులు, పై ఎత్తులు వేయాలన్నది కేతిరెడ్డి వంటి యువ నాయకులతోపాటు.. బొత్స సత్యనారాయణ వంటివారు కూడా అంతర్గత సమావేశాల్లో సూచిస్తున్నారు. ఇటీవల పార్టీ విస్తృత స్థాయి సమావేశం జరిగినప్పుడు.. ఎమ్మెల్సీ వరుదు కల్యాణి.. ఈ విషయాన్నే అడిగారు. వచ్చే ఎన్నికల్లో మనం పొత్తులు పెట్టుకునే అవకాశం ఉందా? అని నేరుగా జగన్మోహన్ రెడ్డినే ప్రశ్నించారు.

ఈ ప్రశ్నకు జగన్ కూడా సమాధానం చెబుతూ…ఈ విషయం నాకు వదిలేయండి. మనం ఎప్పుడైనా పొత్తులు పెట్టుకున్నామా? ఇంకా ఎన్నికలకు చాలా సమయం ఉంది.. అప్పుడు చూద్దాం అంటూ జగన్ మాట్లాడిన మాటలు వెనుక ఆంతర్యం ఏంటి? అంటే ఎన్నికల సమయం నాటికి ఏ పార్టీతో అయినా పొత్తు పెట్టుకుని బరిలో దిగే అవకాశాలు ఉన్నాయా? అంటూ సందేహాలు వ్యక్తం చేస్తున్నారు. పొత్తు తప్పు కాదు అంతకంటే నేరం కూడా కాదు అంటూ ఇటీవల కేతిరెడ్డి కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని తెలిపారు. దీంతో వైసీపీ నేతలతో పాటు అధినేత కూడా పొత్తు గురించి ఆలోచనలో పడ్డారని స్పష్టమవుతుంది. ఒకవేళ పొత్తు పెట్టుకున్న ఏ పార్టీలతో పొత్తు కుదురుతుందనేది తెలియాల్సి ఉంది.