సంచయిత గజపతిరాజు ఊర మాస్ …. ఇది నెక్స్ట్ లెవెల్ అరాచకం అంతే !

విజయనగరం రాజకీయాలను గతం కొన్ని సంవత్సరాలుగా పూసపాటి గజపతి రాజు శాసిస్తున్నారు. ఆయన చంద్రబాబు నాయుడుకు అనుకూలంగా ఉంటూ విజయనగరాన్ని టీడీపీకి కంచుకోటగా మార్చారు. 2019 ఎన్నికల్లో రాష్ట్ర మొత్తం వైఎస్ జగన్మోహన్ రెడ్డి తన హవాను చుపించారు. కానీ విజయనగరంలో తన హవాను చూపించలేకపోయారు. అయితే ఇప్పుడు అక్కడ కూడా వైసీపీ జెండాను పాతడానికి జగన్ పెద్ద ప్లాన్ వేశారు. పూసపాటి వంశస్తురాలునే టీడీపీని పోటీగా నిలబెట్టానున్నారు.

టీడీపీని ఎదురించనున్న పూసపాటి వంశస్థురాలు

ఇప్పటి వరకు టీడీపీని విజయనగరంలో కాపాడింది పూసపాటి వంశస్థులే. కానీ ఇప్పుడు ఆ వంశస్థులనే జగన్ టీడీపీకి ఎదురు నిలబెట్టానున్నారు. ఆ వంశస్తురాలే పూసపాటి సంచయిత. ఈమెను ఉపయోగించి అశోక్ గజపతి రాజును ఎదురించనున్నారు. ఇప్పటికే ఆమెను తూర్పు గోదావరి జిల్లాలోని మాన్సాస్ కి చెందిన 104 దేవాలయాలకు ఆమెను చైర్ పర్సన్ గా నియమిస్తూ వైసీపీ సర్కార్ ఉత్తర్వులు జారీ చేసింది. దాంతో మొత్తం అశోక్ చేతుల నుంచి సంస్థానాధికారాలు జారిపోయాయి. ఇలా ఆమెను ఉపయోగించి టీడీపీని దెబ్బకొట్టడానికి వైసీపీ ప్లాన్ వేసింది.

మంచి అవకాశం మిస్ చేసుకున్న బీజేపీ

సంచయిత పేరుకు బీజేపీలో ఉన్నారు కానీ బీజేపీ నేతలు మాత్రం ఆమెను పట్టించుకోవడం లేదు. కనీసం ఆమెకు ఇవ్వాల్సిన గుర్తింపును కూడా బీజేపీ ఇవ్వడం లేదు. సంచయితను ఉపయోగించుకొని విజయనగరంలో రాజకీయంగా బలపడే అవకాశం ఉన్నప్పటికీ బీజేపీ ఆ అవకాశాన్ని ఎందుకు మిస్ చేసుకుందో ఎవ్వరికి అర్ధం కావడం లేదు. కానీ ఈ అవకాశాన్ని వైసీపీ ఉపయోగించుకొని టీడీపీని విజయనగరంలో దెబ్బకొట్టడానికి వ్యూహం రచించింది.రానున్న రోజుల్లో విజయనగరంలో వైసీపీ జెండా ఎగరవేస్తుందో లేదో వేచి చూడాలి.