ఈ ఒక్క స్కెచ్ తో తిరుపతి ఉప ఎన్నికల సీట్ నేరుగా జగన్ ఖాతాలోకి!!

ap ngo's are ready to go vizag when government anounce that vizag is official capital

2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత జరుగుతున్న మొదటి ఎన్నికలు తిరుపతి ఎంపీ ఉప ఎన్నికలు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని వైసీపీ నాయకులు, టీడీపీ, నాయకులు, బీజేపీ నాయకులు చాలా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే టీడీపీ తమ అభ్యర్థికి కూడా ప్రకటించింది. అయితే ఇప్పుడు ఈ ఉప ఎన్నిక సీఎం జగన్మోహన్ రెడ్డి పాలనకు సంకేతంగా మారుతుండటంతో ఎలాగైనా గెలవాలని వైసీపీ నాయకులు, జగన్మోహన్ రెడ్డి వ్యూహాలు రచిస్తున్నారు.

cm jagan ap
cm jagan ap

దుర్గా ప్రసాద్ కుటుంబ సభ్యులు పోటీలో లేరు

మరణించిన ఎంపీ దుర్గ ప్రసాద్ రావు యొక్క కుటుంబ సభ్యులనే వైసీపీ సింపతీ కోసం పోటీకి నిలబెడుతుందని అంతా అనుకున్నారు కానీ తిరుప‌తి లోక్ స‌భ సీటు ఉప ఎన్నిక విష‌యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత వ‌ర‌కూ స్ప‌ష్ట‌త‌ను ఇచ్చింది. బ‌ల్లి దుర్గాప్ర‌సాద‌రావు త‌న‌యుడు క‌ల్యాణ్ కు ఎమ్మెల్సీ నామినేష‌న్ ఇస్తూ, ఒక కొత్త వ్య‌క్తి తిరుప‌తి నుంచి పోటీ చేయ‌బోతున్నారని సమాచారం. ఈ రిజ‌ర్వ‌డ్ నియోజ‌క‌వ‌ర్గంలో ఒక డాక్ట‌ర్ ను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోటీ పెట్ట‌బోతోంద‌ని స‌మాచారం. ఇప్ప‌టి వ‌ర‌కూ ఆయ‌న ఎలాంటి ఎన్నిక‌ల్లోనూ పోటీ చేయ‌లేద‌ని కూడా స్ప‌ష్టం అవుతోంది.

జగన్ గెలుస్తాడా!!

దుబ్బాక ఎన్నికల్లో టీఆర్ఎస్ కంచుకోటలో బీజేపీ తన విజయపతాకాన్ని ఎగురవేసి, టీఆర్ఎస్ కు చుక్కలు చూపిస్తుంది. అలాగే ఇప్పుడు తిరుపతిలో కూడా గెలిచి జగన్ ను దెబ్బకొట్టడానికి బీజేపీ నాయకులు, టీడీపీ నాయకులు పెద్ద ఎత్తున వ్యూహాలు రచిస్తున్నారు. ఈ వ్యూహాలను జగన్ ఎలా ఎదుర్కొంటారో, తన పార్టీని ఎలా గెలిపించుకుంటారో వేచి చూడాలి. అలాగే ప్రజలు కూడా జగన్ కే మద్దతు ఇస్తారా లేక వేరే పార్టీకి మొగ్గు చూపుతూ వైసీపీని ఇంటికి పంపిస్తారో వీచు చూడాలి.