విశాఖ రాజకీయాలను వైఎస్ జగన్ మర్చనున్నరా! టీడీపీకి, బీజేపీకి దగ్గర అవుతున్న వైసీపీ ఎంపీ సత్యనారాయణ!!

everyone targets ys jagan mohan reddy

వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలను పూర్తిగా తన అధీనంలో ఉంచుకోవడమే కాకుండా వాటిలో కీలక మార్పులు తెస్తున్నారు. ఇప్పుడు విశాఖలో ఉన్న రాజకీయాలను మార్చే పనిలో వైఎస్ జగన్ ఉన్నారు. ఇప్పటికే మూడు రాజధానుల అంశంతో విశాఖను నిత్యం వార్తల్లో ఉండేలా చేశారు. అయితే ఇప్పుడు అక్కడ ఎంపిగా ఉన్న వైసీపీ నేత ఎంవీవీ సత్యనారాయణకి షాక్ ఇచ్చే పనిలో జగన్ ఉన్నారు. దీనికి సత్యనారాయణ యొక్క అసాధారణమైన ప్రవర్తన కారణమని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి.

అనూహ్యంగా ఎదిగి ఒక్కసారిగా పడిన సత్యనారాయణ

ఎన్నికలకు సరిగ్గా ఎనిమిది నెలల ముందు పార్టీలో చేరి ఎకా ఎకిన ఎంపీ అయిపోయిన లక్కీ ఫెలో గా ఎంవీవీ సత్యనారాయణను చెప్పుకుంటారు. అంతకు ముందు ఆయన కొన్ని చిన్న సినిమాలు తీశారు, అలాగే బిల్డర్ గా ఉన్నారు. ఇక ఎంపీగా ఎంవీవీ గెలిచినా కూడా పనితీరులో తనదైన మార్క్ ని ఇప్పటిదాకా చూపించలేకపోయారు అన్న విమర్శలు ఉన్నాయి. మరో వైపు చూసుకుంటే ఎంవీవీ సత్యనారాయణ తనకంటూ సొంత రాజకీయాన్ని మొదలుపెట్టారు. వైసీపీ నాయకులందరూ టీడీపీ, బీజేపీకి దూరంగా ఉంటే సత్య నారాయణ మాత్రం వాళ్లకు చాలా క్లోజ్ గా ఉంటున్నారు. ఈ మధ్య ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు విశాఖకు విడిది చేస్తే ఆయన వెళ్ళి కలవడంపైన కూడా కొంత చర్చ సాగింది. మరో వైపు మాజీ ఎంపీ బీజేపీ నేత కంభంపాటి హరిబాబుతో కూడా క్లోజ్ గా ఉంటారు అంటారు.

వైసీపీ ఫ్యామిలీ నుంచేనా!!

సత్యనారాయణ యొక్క అసాధారణమైన రాజకీయాల చేత విసుగెత్తిన జగన్మోహన్ రెడ్డి వచ్చే ఎన్నికల సమయం వరకు విశాఖలో తనకు సన్నిహితంగా ఉండే వారిని ఉంచాలని అనుకుంటున్నారు. అందుకే విశాఖ యొక్క ఎంపీ సీట్ వైఎస్ కుటుంబ సభ్యులకు ఇవ్వనున్నారని రాజకీయ వర్గాలు చెప్తున్నాయి. విశాఖను ఎలాగో రాజధానిగా చేయాలని జగన్ అనుకుంటున్నారు కాబట్టి అక్కడ తన కుటుంబ సభ్యులనే ఉంచాలని జగన్ భావిస్తున్నారు. ఈ దెబ్బతో రానున్న విశాఖలో కూడా టీడీపీకి వైసీపీ నుండి ఇబ్బందులు తప్పవు.