జగన్ ముందు ముగ్గురు పెద్ద రెడ్లు ఫెయిల్.. అందుకే చిన్న రెడ్డికి పార్టీ పగ్గాలు ?

వైఎస్ జగన్ సీఎం అవడంతోనే అయన భుజాల మీద పెను భారం పడింది.  ఒకవైపు కనీసం స్థిరమైన రాజధాని లేని, పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయిన రాష్ట్రం యొక్క బాగోగులు చూసుకోవాలి.  బోలెడు ఆశలు పెట్టుకున్న ప్రజానీకాన్ని సంతృప్తి పరచాలి.  ఇంకోవైపు అశేషమైన పార్టీని కాపాడుకోవాలి.  ఇలా రెండు బాధ్యలతో జగన్ సతమతమవుతున్నారు.  ఎక్కువ సమయాన్ని పాలనకే కేటాయిస్తుండటం వలన పార్టీ బాగోగులు చూసుకోలేకపోతున్నారు.  దాని ఫలితంగా పార్టీలో లుకలుకలు మొదలయ్యాయి.  ఇప్పటి వరకు జగన్ కు గెలిచిన అభ్యర్థులందరితో నింపాదిగా మాట్లాడే అవకాశమే రాలేదు.  అలాంటిది నియోకవర్గాల వారీగా పరిస్థితులను పర్యవేక్షించే అవకాశం ఎక్కడుంటుంది.  అందుకే ఆయన ముగ్గురు పెద్ద తలకాయలకు ఆ బాధ్యత అప్పజెప్పారు. 

YS Jagan to put more responsibilities on Midhun Reddy
YS Jagan to put more responsibilities on Midhun Reddy

పెద్ద వాళ్ళు ఫెయిల్ ?

ఆ ముగ్గురే విజయసాయిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, వైవీ సుబ్బారెడ్డి.  వీరిలో కేంద్ర పార్టీ కార్యాలయ భాద్యతలతో పాటు కర్నూల్, అనంతపురం, కడప, నెల్లూరు, ప్రకాశం జిల్లాల భాద్యతలను సజ్జల రామకృష్ణారెడ్డికి అప్పగించిన సీఎం ఉభయగోదావరి జిల్లాలు, చిత్తూరు, కృష్ణా, గుంటూరు భాద్యతలను సొంత బంధువు వైవీ సుబ్బారెడ్డికి అలాగే శ్రీకాకుళం, విశాఖ, విజయనగరం జిల్లాల భాద్యతలను విజయసాయిరెడ్డికి అప్పగించారు.  ఈ ముగ్గురు వారి వారి జిల్లాల్లో పార్టీని భద్రంగా చూసుకోవాలి.  ఎలాంటి సమస్య అయినా వారి వద్దే పరిష్కారం కావాలి కానీ బయటకు వచ్చి రచ్చ కావడం, పంచాయితీలు తన వరకు రావడం జరగకూడదు అనేది జగన్ ఉద్దేశ్యం.  

YS Jagan to put more responsibilities on Midhun Reddy
YS Jagan to put more responsibilities on Midhun Reddy

కానీ అలా జరగలేదు.  నిత్యం ఎక్కడో ఒక చోట అంతర్గత కలహాలు బయటపడుతూనే ఉన్నాయి.  కొన్ని చోట్ల ఎమ్మెల్యేలకు, ఎంపీలకు పొసగడంలేదు.   కొన్ని చోట్ల మంత్రులకు, ఎమ్మెల్యేలకు పడట్లేదు.  ఇంకొన్ని చోట్ల టీడీపీ నుండి వచ్చిన నేతలతో సొంత పార్టీ వాళ్లకు గొడవలు.  పలుచోట్ల ఆరోపణలు.  ఇలా ఏదో ఒక సమస్య ఉత్పన్నమై మీడియాలో రచ్చ రచ్చ జరుగుతోంది.  సమస్యలు వెలుగులోకి వస్తున్నాయి కానీ వేటికీ పరిష్కారం లేదు.  అంటే జిల్లాలు విభజించి నియమించిన ముగ్గురు పెద్ద తలలు తమ బాధ్యతల్లో విఫలమైనట్టే అనుకొవాలేమో.  అందుకే జగన్ ఇలా ప్రతి చిన్న గొడవను తానే పరిష్కరించుకుంటూ పోవాలంటే పుణ్య కాలం కాస్తా గడిచిపోతుందని భావించి పార్టీ వ్యవహారాల వరకు ఒక సమర్థవంతమైన వ్యక్తికి బాధ్యతలు ఇస్తే బాగుంటుందని భావిస్తున్నారట. 

అందుకోసం ఆయన ఎంచుకున్న వ్యక్తి పివి. మిథున్ రెడ్డి.  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుమారుడైన మిథున్ రెడ్డి అంటే జగన్ కు మంచి గురి.  అందుకే ఆయన్ను లోక్ సభలో పార్టీ లీడర్ను చేశారు.  ఆయన సామర్థ్యం మీద జగన్ కు పూర్తి నమ్మకం ఉంది.  చిన్నావాడే అయినా అందరినీ కలుపుకుపోగల లౌక్యం ఉన్నవాడు.  కాబట్టే పార్టీ బాగోగులు చూసుకునే బాధ్యతను అతని చేతిలో పెడితే బాగుంటుందని జగన్ యోచిస్తున్నట్టు చెప్పుకుంటున్నారు.