తన ఫేవరెట్ కీలక నేత కోసం ఒక స్పెషల్ పదవిని దాచి ఉంచిన వైఎస్ జగన్ !

YS Jagan following new trend in ruling

వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 2019 ఎన్నికల సమయంలో చేసినన్ని రాజకీయ సమీకరణాలు ఇప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు చేసి ఉండరు. ఆయన చేసిన సమీకరణాలు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు చిత్తు అయిపోయారు. అలా జగన్ చేసిన రాజకీయ సమీకరణాల వల్ల కొంతమంది నాయకులు లాభపడగా, అలాగే వైఎస్ జగన్ ను నమ్ముకొని ఉన్న వైసీపీ నాయకుల్లో చాలామంది నష్టపోయారు. అలా నష్టపోయిన వారిలో రాజంపేట మాజీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి ఒకరు. కానీ జగన్ మాత్రం తనను నమ్ముకున్న వారికి జగన్ ఎదో ఒక పదవి ఇస్తూ వారిని తృప్తిపరుస్తున్నారు.

ys jagan reserve a key position to his favorite leader

ఇప్పుడు అమర్ నాధ్ రెడ్డి కూడా ఎదో ఒక పదవి కోసం ఎదురు చూస్తున్నారు. 2009లో రాజంపేట నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డి గెలుపొందారు. వైఎస్ మరణం తర్వాత ఆయన వైఎస్ జగన్ చెంతకు చేరారు. రాజీనామా చేసి 2012 లో జరిగిన ఉప ఎన్నికల్లోనూ గెలిచారు. 2014 ఎన్నికల్లో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ టిక్కెట్ ఇచ్చినా విజయం సాధించలేదు. 2019 ఎన్నికల సమయానికి అప్పటి టీడీపీ ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి వైసీపీ లో చేరడంతో ఆయనకు టిక్కెట్ ఇవ్వాల్సి వచ్చింది. దీంతో ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డిని వైఎస్ జగన్ పక్కన పెట్టారు.

అధికారంలోకి రాగానే ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి టీటీడీ ఛైర్మన్ పదవి దక్కుతుందని అందరూ భావించారు. ఆకేపాటి స్వతహాగా వెంకటేశ్వరస్వామి భక్తుడు కావడంతో ఆ పదవిని ఆశించారు. అయితే వైవీ సుబ్బారెడ్డికి వైఎస్ జగన్ ఇవ్వడంతో ఆ పదవి కూడా ఆకేపాటికి మిస్ అయింది. కానీ జగన్ ఆకేపాటి అమర్ నాధ్ రెడ్డికి జగన్ కడప జిల్లా పరిషత్ ఛైర్మన్ పదవిని రిజర్వ్ చేసినట్లు తెలిసింది. వైఎస్ జగన్ కు తమ కుటుంబీకుల నుంచి వత్తిడి వచ్చినా ఆకేపాటికే ఇవ్వనున్నట్లు స్పష్టం చేసినట్లు తెలిసింది. ఈ పదవి కోసం ఎవరూ తన వద్దకు రావద్దని ఆకేపాటికి ఫైనల్ చేశానని చెప్పడంతో ఆయన వర్గం ఖుషీగా ఉంది. వైఎస్ జగన్ తన ఫేవరేట్ లీడర్ కోసం తీసుకున్న నిర్ణయం వైసీపీ లో కొంతమందికి ఇష్టం లేకపోయినా కూడా నమ్ముకున్న వారికి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఎంత దూరమైన వెళ్తారనే విషయం తెలుస్తుంది.