Ys Jagan, Chiru And Mohan : చిరు – జగన్ – ఒక మోహన్ బాబు.. ఇండస్ట్రీలో ఆసక్తిగా మారిపోయిన ఈ అంశం.!

Ys Jagan, Chiru And Mohan :ఇప్పుడు మళ్లీ టాలీవుడ్ ని కలవరపెడుతున్న కరోనా ఏమో కానీ ఇండస్ట్రీ వర్గాల్లో మాత్రం అసలు ఊహించని పరిణామాలే చోటు చేసుకుంటున్నాయి. జస్ట్ ఈ గడిచిన మూడు రోజుల్లోనే పలు సంచలన అంశాలు పెద్ద ఎత్తున హాట్ టాపిక్ గా నిలిచాయి. గత కొన్ని నెలలు నుంచి టికెట్ ధరల అంశం సమస్యగా ఉన్న విషయం తెలిసిందే.

అయితే దీనిపై మొన్నటికి మొన్న మొట్ట మొదటిసారిగా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం హాట్ టాపిక్ గా మారింది. ఈ తర్వాత రోజే టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి తనని ఎవరు ఇండస్ట్రీలో పెద్ద అనవద్దని నాకు అది ఇష్టం లేదని ఏ సమస్య వచ్చినా నా దగ్గరకి రావద్దని మీలో మీరు కొట్టుకొని నన్ను పరిష్కారం అడిగితే నేనేం చేస్తా అని తెలిపారు.

అలాగే ఏదన్నా సాయం అంటే చేస్తా తప్ప ఇంకా దేనికి నన్ను లాగొద్దు అనే రేంజ్ లో మాట్లాడ్డం జరిగింది. ఇక ఇది పక్కన పెడితే సరిగ్గా చిరు ఈ స్టేట్మెంట్స్ పాస్ చేసిన తర్వాత అసలు ఇంతకు ముందు ఎప్పుడూ కూడా మాట్లాడని మంచు మోహన్ బాబు ఒక సంచలన ప్రెస్ నోట్ తో వచ్చి హడావుడి చేసాడు.

టాలీవుడ్ పై అమితమైన ప్రేమను కనబరుస్తూ తానే ఇక నుంచి ఇండస్ట్రీలో పెద్ద అన్నట్టు వ్యాఖ్యానించారు. దీనితో వరుసగా జరిగిన ఈ అంశాలు ఈ ముగ్గురు వ్యక్తులు పట్ల ఊహించని విధంగా జరిగినట్టే అని చెప్పాలి. మొదట జగన్ మాట్లాడ్డం, తర్వాత చిరు తప్పుకోవడం ఆ తర్వాత మోహన్ బాబు బాధ్యత తీసుకుంటున్నా అన్నట్టు ప్రెస్ నోట్ రిలీజ్ చెయ్యడం ఇవన్నీ చూస్తుంటే ఎక్కడో తేడా కొడుతోంది అని ఇండస్ట్రీ వర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనితో ఇంటర్ లింక్ గా ఈ ముగ్గురు పేర్లు హాట్ టాపిక్ గా నిలిచాయి.