‎War 2: ఎన్టీఆర్ వార్ 2 మూవీ కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌!

‎‎War 2: టాలీవుడ్ ప్రేక్షకులతో పాటు బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న చిత్రం వార్ 2. అయాన్ ముఖర్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో హృతిక్ రోషన్, జూనియర్ ఎన్టీఆర్ లు కలిసి నటిస్తున్న విషయం తెలిసిందే. యశ్ రాజు ఫిలిం సంస్థ ఈ సినిమాని నిర్మిస్తోంది. స్పై యాక్షన్ త్రిల్లర్ గా ఈ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమా కోసం ఉత్తరాది ప్రేక్షకులతో పాటు దక్షిణాది సినీ ప్రియులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.

‎దానికి తోడు ఈ సినిమా నుంచి విడుదల అయిన అప్డేట్లు సినిమాపై అంచనాలను భారీగా పెంచేసాయి. కాగా ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానున్న విషయం మన అందరికి తెలిసిందే. దీంతో ఈ సినిమా విడుదల కోసం ఈ సినిమా అప్డేట్ ల కోసం ప్రేక్షకులు ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఆ సంగతి పక్కన పెడితే వెండితెరపై యుద్ధానికి కౌంట్‌ డౌన్‌ స్టార్ట్‌ అయింది. 30 రోజుల్లో బాక్సాఫీస్‌ విధ్వంసానికి వార్‌ 2 సిద్ధం అంటూ చిత్ర యూనిట్‌ తెలిపింది. కాగా ఈ సినిమా ద్వారా హీరో ఎన్టీఆర్‌ హిందీ చిత్ర పరిశ్రమకి పరిచయమవుతున్న విషయం తెలిసిందే.

‎ఈ చిత్రం ఆగస్టు 14న హిందీ, తెలుగు, తమిళ భాషల్లో పాన్‌ ఇండియా ఫిల్మ్‌గా విడుదల కానుంది. అయితే విడుదల తేదీకి మరొక 30 రోజులు అనగా నెల రోజుల సమయం ఉన్న విషయం తెలిసిందే. దాంతో వార్‌ 2 ముప్పై రోజుల్లో రానుందని తెలిసేలా తాజాగా ఒక పోస్టర్‌ ను విడుదల చేశారు మూవీ మేకర్స్‌. ఈ పోస్టర్‌ లో హృతిక్‌ రోషన్, ఎన్టీఆర్, కియారా అద్వానీ పాత్రల్ని చూపించేలా డిజైన్‌ చేశారు. యాక్షన్ ఓరియంటెడ్‌ స్పై డ్రామాగా రూపొందిన చిత్రం వార్‌ 2 అని చిత్రబృందం పేర్కొంది. కాగా ఇందుకు సంబంధించిన పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవడంతో వెయిటింగ్ అంటూ కామెంట్లు చేస్తున్నారు అభిమానులు.