2024 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ తిరుపతి నుంచి పోటీ చేసే అవకాశాలు అయితే ఉన్నాయని వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తున్నాయి. చిరంజీవి 2009 ఎన్నికల్లో తిరుపతి నుంచి పోటీ చేసి విజయం సాధించడంతో పవన్ ఈ నియోజకవర్గంపై దృష్టి పెట్టారు. అయితే తిరుపతిలో జనసేన కార్యకర్తలు, నేతలు యాక్టివ్ గా లేకపోవడం పవన్ కళ్యాణ్ కు మైనస్ అవుతోంది. పవన్ సర్వేలు చేయించగా తిరుపతిలో అనుకూలంగా ఫలితాలు రాలేదని కామెంట్లు వినిపించాయి.
రాజోలులో జనసేనకు బలం ఉన్నా ఆ నియోజకవర్గం ఒక కులానికి కేటాయించిన నియోజకవర్గం కావడంతో పవన్ కళ్యాణ్ కు అక్కడినుంచి పోటీ చేసే అవకాశం అయితే లేదు. పవన్ కళ్యాణ్ ప్రస్తుతం పిఠాపురం నియోజకవర్గంపై దృష్టి పెట్టారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. గోదావరి జిల్లాలలో ఇతర జిల్లాలతో పోల్చి చూస్తే పవన్ కు అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉండటంతో పాటు ఆయన సొంత కులానికి చెందిన ప్రజలు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు.
సరైన నాయకులను నిలబెడితే గోదావరి జిల్లాలలో జనసేన పార్టీ ఊహించని స్థాయిలో సీట్లు సాధించే ఛాన్స్ ఉంది. అదే సమయంలో ఇక్కడ జనసేన బలమైన అభ్యర్థులను నిలబెడితే టీడీపీ నష్టపోయే అవకాశం ఉంటుంది. 2019 ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన జనసేన అభ్యర్థికి 28,000కు పైగా ఓట్లు వచ్చాయి. పవన్ పోటీ చేస్తే ఇక్కడ జనసేన విజయం సాధించే అవకాశాలు ఉన్నాయి.
జనసేన ఈ నియోజకవర్గంలో బలంగా ఉందని సమాచారం అందుతోంది. పలు యూట్యూబ్ ఛానెళ్లతో పవన్ ఈ నియోజకవర్గంలో సర్వే నిర్వహిస్తున్నారని తెలుస్తోంది. యూత్ పవన్ కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఎక్కువ కాబట్టి జనసేన ఇక్కడ అద్భుతాలు చేసినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం అయితే లేదు. పవన్ 2024 ఎన్నికల్లో కచ్చితంగా ఎమ్మెల్యే కావాలని ఆయన అభిమానులు కోరుకుంటున్నారు.