క్లబ్ లో యువతిని వేధించిన యువకులు.. ఆ తర్వాత?

ఈ మధ్యకాలంలో పబ్ కల్చర్ అన్నది మన దేశంలో కూడా సర్వసాధారణమైపోయింది. సాయంత్రం సమయాల్లో ఫ్రెండ్స్ తో కలిసి పబ్బులకు వెళ్లడం, బాగా తాగి చిందులు వేయడం,అర్ధ రాత్రి వరకు బైక్ లో షికార్లు చేయడం, అలాగే రోడ్లపై కనిపిస్తే అమ్మాయిలను ఏడిపించడం లాంటివి చేస్తున్నారు. ఇలాంటివి ఘటన ఒకటి తాజాగా హైదరాబాదులో చోటు చేసుకుంది. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో రోగ్ క్లబ్ కు ఒక యువతి తన స్నేహితులతో కలిసి వెళ్ళింది. పబ్ లో తన ఫ్రెండ్స్ తో ఎంజాయ్ చేసిన తరువాత తిరిగి ఇంటికి వెళ్తున్న సమయంలో కొందరు యువకులు ఆమె చుట్టూ చేరి ఆ యువతితో అసభ్యంగా ప్రవర్తించారు.

ఆ యువతిని వేధింపులకు గురి చేశారు. కారు కోసం ఎదురు చూస్తున్న ఆ యువతికి అడ్డుతగిలారు. ఎవరు మీరు ఏం కావాలి అని ఆ యువతి ప్రశ్నించగా.. నీ కారు ఎక్సేంజ్ చేసుకుందామా అంటూ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. ఎక్కువ మాట్లాడితే ఆ యువతి కారు తగలబెడతారు కూడా బెదిరించారు.ఎలాగో అలా ఆ యువకుల నుంచి పెంచుకున్న ఆ యువతి నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి వారికి ఫిర్యాదు చేసింది. ఆ యువతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న జూబ్లీహిల్స్ పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ మధ్యకాలంలో ఇలాంటివి ఎక్కువగా చోటుచేసుకుంటున్నాయి.

పబ్బులో తాగి తందనాలు ఆడడం అనంతరం రోడ్డుపై కనిపించే అమ్మాయిలను, యువతులను వేధించడం, వారిని చిత్రహింసలకు గురి చేయడం అలవాటు అయిపోయింది. చిన్న పిల్లలు కూడా పబ్బులకు వెళ్లి తాగి తందనాలు ఆడుతూ వారి భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారు. 21 సంవత్సరాల లోపు పిల్లలను, మైనర్ లను పబ్బుల్లోకి అనుమతించకూడదని కఠిన నిబంధనలు పెట్టినప్పటికీ, పబ్బు యాజమాన్యం వీటిని ఏమాత్రం పట్టించుకోవడం లేదు. నిబంధనలు పాటించకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాదులో అయితే పబ్బుల తీరు రోజు రోజుకు మరీ వివాదాస్పదంగా మారుతోంది. ఆ యువతిని వేధించిన ఆ యువకుల కోసం ప్రస్తుతం పోలీసులు వెతుకుతున్నారు.