ఆ హీరోను పక్కకు తోసి ఆ జాబితాలో రెండో స్థానంలో నిలబడిన ఎన్టీఆర్?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అగ్ర నటుడిగా కొనసాగడమే కాకుండా త్రిబుల్ ఆర్ సినిమా ద్వారా పాన్ ఇండియా హీరోగా గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ గురించి అందరికీ సుపరిచితమే. ఈ సినిమాలో ఎన్టీఆర్ నటనకు ప్రతి ఒక్కరూ ఫిదా అయ్యారు. ఇక కొన్ని సన్నివేశాలలో ఎన్టీఆర్ తన స్థాయిని తగ్గించుకుని మరి నటించారని విమర్శకుల నుంచి ప్రశంసలు అందాయి. ఈ విధంగా ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ సినిమాలో తన నటనతో అందరినీ మెప్పించారు.

తాజాగా ఆర్మాక్స్ మీడియా 2022 సంవత్సరం ఏప్రిల్ వరకు పాన్ ఇండియా స్టార్స్ పై అధ్యయనం చేశారు. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ మొదటి స్థానంలో నిలబడగా ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ హీరోల జాబితాలో రెండవ స్థానంలో నిలబడ్డారు. ప్రభాస్ మూడవ స్థానం అల్లు అర్జున్ 4వ స్థానంలో చోటు దక్కించుకున్నారు. ఇక ఈ అధ్యయనంలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 5వ స్థానానికి పరిమితమయ్యారు. ఆరవ స్థానంలో కోలీవుడ్ స్టార్ హీరో అజిత్ చోటు సంపాదించుకున్నారు.

కేజిఎఫ్ సినిమాతో సంచలనం సృష్టించిన యశ్ ఏడవ స్థానంలో ఉండగా, ఎనిమిదవ స్థానంలో రామ్ చరణ్ 9వ స్థానంలో సూర్య, పదవ స్థానంలో మహేష్ బాబు ఉన్నారు. ఇలా ఆర్మాక్స్ మీడియా సర్వేలో భాగంగా పాన్ ఇండియా స్టార్ హీరోల జాబితాలో అందరూ కూడా సౌత్ ఇండియన్ స్టార్స్ గా ఉండటం గమనార్హం. కేవలం ఒక అక్షయ్ కుమార్ మినహా మిగిలిన వారందరూ కూడా సౌత్ ఇండియన్ స్టార్ టాప్ టెన్ లో చోటు దక్కించుకోవడం గమనార్హం.