హీరోలు తమ పని తాము చేసుకుని దర్శకుల పనిని దర్శకులను చేసుకోనివ్వాలి. దర్శకుడు చెప్పిందే చెయ్యాలి. అతని మీద నమ్మకం ఉంది స్వేచ్ఛను ఇవ్వాలి. అలా చేసినవాళ్ళే స్టార్ హీరోలుగా ఎదిగారు, ఎదుగుతున్నారు. అలా కాకుండా దర్శకుడి పనిలో కూడ వేలుపెడితే మొదటికే మోసం వస్తుంది. ఒక యంగ్ హీరో సరిగ్గా ఇదే చేసి దెబ్బతిన్నాడు. చిన్నగానే కెరీర్ స్టార్ట్ చేసిన ఈ హీరో అడపాదడపా విజయాలు అందుకుని ప్రేక్షకుల్లో మంచి గుర్తింపు, ఒక మాదిరి మార్కెట్ లెవల్ సంపాదించుకున్నాడు. జాగ్రత్తగా నడుచుకుని ఉంటే ఈపాటికి నాని, శర్వా స్థాయిలో సెటిలయ్యేవాడే.
కానీ మధ్యలో ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఇక్కడ ఓవరాక్షన్ అంటే మరేదో కాదు.. దర్శకుడి పనిలో వేలు పెట్టడం అన్నమాట. తన వద్దకు ఏ కథ వచ్చినా దానికి ట్రీట్మెంట్ ఇవ్వడం పనిగా పెట్టుకున్నాడట. అది కూడ ఆషామాషీ ట్రీట్మెంట్ కాదు.. ఏకంగా కథ రూపురేఖల్ని మార్చేసే ట్రీట్మెంట్. అలా చేయబట్టే వరుస ఫ్లాపులు అతన్ని కుదిపేశాయి. అసలు మార్కెట్ ఉందో లేదో కూడ తెలియని సిట్యుయేషన్. ఇంతకుముందు అతని సినిమా అంటే ఆసక్తి చూపిన బయ్యర్లు ఇప్పుడు లైట్ అంటున్నారు. నిర్మాతలూ అంతే అరకొర బడ్జెట్ తప్ప పెద్ద మొత్తంలో అతని మీద ఖర్చు పెట్టడానికి వెనకాడుతున్నారు.
అందుకే కొత్త దర్శకులు ఆ హీరో దగ్గరికి కథను తీసుకెళ్లాలంటే వెనకడుగు వేస్తున్నారట. ఆ హీరో దగ్గరకు వెళితే కథ కథలా ఉండదని, దర్శకత్వం మన చేతుల్లో ఉండదని, వేళ్లే కాదు కాళ్ళు కూడ పెట్టేస్తాడని చెప్పుకుంటున్నారు. మరి ఇప్పటికైనా దర్శకుల పనిలో తలదూర్చడం తగ్గించి ఈ నెగెటివిటీని పోగొట్టుకుంటేనే ఆ హీరోకు భవిష్యత్తు లేకుంటే కష్టాలే.