కాజల్ అగర్వాల్ నెల సంపాదన ఎంతో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే?

కాజల్ అగర్వాల్ లక్ష్మి కళ్యాణం సినిమా ద్వారా వెండితెరకు పరిచయమైన ఈమె అనంతరం మగధీర చందమామ వంటి వరుస హిట్ సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్నారు. ఈ విధంగా గత దశాబ్దన్నర కాలం నుంచి దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్రతారగా కొనసాగుతున్న ఈమె ప్రస్తుతం సినిమాలకు దూరంగా ఉన్నారు. కాజల్ అగర్వాల్ 2020 వ సంవత్సరంలో గౌతమ్ కిచ్లు అనే వ్యక్తిని వివాహం చేసుకొని ప్రస్తుతం ఓ పండంటి బిడ్డకు జన్మనిచ్చారు. ఈ క్రమంలోనే ఈమె సినిమాలకు కాస్త విరామం ఇచ్చారు.

కాజల్ కేవలం తెలుగు తమిళ సినిమాలలో మాత్రమే కాకుండా హిందీ సినిమాల్లో కూడా నటించి మంచి గుర్తింపు పొందారు. అదేవిధంగా ఈమె ఎన్నో బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తూ రెండు చేతులా సంపాదిస్తున్నారు. అలాగే తన భర్త ఇంటీరియర్ డిజైనర్ కావడంతో ఈమె కూడా బిజినెస్ రంగంలోకి అడుగుపెట్టారు. ఇలా కాజల్ అగర్వాల్ భారీగానే సంపాదించారు.

ఇక సోషల్ మీడియాలో కూడా కాజల్ ఎంతో యాక్టివ్ గా ఉంటారు. తనకు విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ కూడ ఉంది. ఈమె సోషల్ మీడియా వేదికగా ఒక పోస్ట్ చేసిన పెద్ద మొత్తంలోనే డబ్బులు సంపాదిస్తారు. ఇలా అన్ని వైపుల నుంచి కాజల్ అగర్వాల్ నెలకు సుమారు కోటి రూపాయలకు పైగా డబ్బులు సంపాదిస్తారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం అయితే ఈమె తల్లి కావడంతో కొన్ని రోజుల పాటు సినిమాలకు దూరంగా కానున్నారు.