ఏలూరు కార్పొరేషన్ వైసీపీ కైవసం

YCP won Eluru Corporation

కొవిడ్‌ కారణంగా రెండు నెలల తర్వాత ఎన్నికల కమీషన్‌ ఆదేశాల మేరకు ఆదివారం జరిగిన కార్పొరేషన్ ఎన్నికల ఓట్ల లెక్కింపులో ఏలూరు పీఠాన్ని వైసీపీ కైవసం చేసుకుంది. మొత్తం 50 డివిజన్లకు ఎన్నికలు జరిగగా ఇందులో మూడు డివిజన్లు ముందుగానే ఏకగ్రీవంగా వైసీపీ వశమయ్యాయి. ఇక మిగిలిన 47 స్థానాలకు ఎన్నికలు నిర్వహించారు. ఇందులో 47 డివిజన్లలో 44 స్థానాల్లో వైసీపీ అభ్యర్థులు విజయం సాధించారు. టీడీపీ అభ్యర్థులు 3 చోట్ల గెలుపొందారు. జనసేన పార్టీ ఒక్క డివిజన్ లోనూ గెలవలేకపోయింది.

YCP won Eluru Corporation

మేయర్‌ పదవిని ఈసారి జనరల్‌ మహిళకు కేటాయించారు. ఈ ఏడాది మార్చి 10న రాష్ట్రవ్యాప్తంగా 12 మున్సిపల్ కార్పొరేషన్లు, 75 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగాయి. వీటిలో ఏలూరు మినహా మిగిలిన కార్పొరేషన్లకు కౌంటింగ్ నిర్వహించగా 11 వైసీపీ ఖాతాలో చేరాయి. అలాగే 75 మున్సిపాలిటీల్లో అనంతపురం జిల్లా తాడిపత్రి మినహా మిగిలిన అన్ని మున్సిపాలిటీలను వైసీపీ కైవసం చేసుకుంది. తాజాగా ఏలూరు కార్పొరేషన్ వైసీపీ ఖాతాలో చేరింది. పశ్చిమగోదావరి జిల్లా వైసీపీ పార్టీ కార్యవర్గం ఘనంగా సంబరాలు చేసుకుంటున్నారు.