తేదాపా అధినేత చంద్రబాబు నాయుడు అండ్ కో మహానాడుకు సన్నధమవుతోంది. ఈనెల 27, 28వ తేదీల్లో జరిగే మహానాడులో 13 తీర్మానాలు ప్రవేశపెట్టడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. జగన్ ఏడాది పాలనను ఎండగట్టడమే ఎజెండాగా ఫిక్స్ అయినట్లు ఇప్పటికే లీకులందుతున్నాయి. పార్టీ సీనియర్ నేతలంతా జూమ్ యాప్ లో ఈ విషయంపైనే వారం రోజులుగా తలమునకలై ఉన్నారు. ప్రస్తుతం రాష్ర్టంలో చోటు చేసుకున్న పరిస్థితులను రాజకీయ అస్ర్తాలుగా వాడుకోవాలని సీనియర్స్ అంతా ప్లాన్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు హుటాహుటిన ప్రభుత్వ అనుమతులు తీసుకుని విశాఖ, అమరావతి పర్యటనను పూర్తిచేసారు. 65 రోజుల తర్వాత ఇల్లు కదిలిన చంద్రబాబు కార్యకర్తల రియాక్షన్ ఎలా ఉంటుందన్నది నిన్న ఓ ట్రైల్ వేసి చెక్ చేసుకున్నారు.
అమరావతిలో ఘనంగా స్వాగతం లభించడంతో చంద్రబాబు దిల్ ఖుష్ అయింది. ప్రభుత్వంపై వ్యతిరేకత…తమ పార్టీపై సానుభూతి బాగానే ఉందని నిన్నటి సన్నివేశం బాబుకు చెప్పకనే చెప్పింది. దీంతో మహానాడు ని ఆన్ లైన్ లో నిర్వహించుకున్నా వచ్చిన ఢోకా లేదని ఓక్లారిటీకి వచ్చారు. అయితే సరిగ్గా మహానాడుని నీరు గార్చేలా అధికార పక్షం పావులు కదుపుతోందన్న ప్రచారం ఇప్పుడు సంచలనంగా మారింది. దక్షిణ కోస్తా, గోదావరి జిల్లాల్లో ఈ టాపిక్ పై చర్చ మామూలుగా లేదిప్పుడు. చంద్రబాబు అండ్ కోకి సరైన గిప్టుని వైకాపా సిద్దం చేస్తుందని అంటున్నారు.
దక్షిణ కోస్తా టీడీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు వైకాపా తీర్ధం తీసుకోవడానికి రెడీ అవుతున్నారని విశ్వసనీయ సమాచారం. సరిగ్గా ఆ ఘట్టం మహానాడు రోజున పూర్తిచేసి చంద్రబాబు జీవితాంతం గుర్తుడిపోయేలా గిప్ట్ ఇవ్వాలని వైకాప్ స్కెచ్ వేస్తోందని ప్రచారం సాగుతోంది. వైకాపా నెంబర్ -2గా ఉన్న ఓ నేతతో ఆ ఇద్దరు పచ్చ తమ్ముళ్లు భేటి అయ్యారని ఇన్ సైడ్ టాక్ వినిపిస్తోంది. వాస్తవానికి ఆ ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేల విషయంలో గతంలోనే జంపింగ్ వార్త చక్కెర్లు కొట్టింది. కానీ కొన్ని రోజులకి కామ్ అప్ అయిపోయింది. సరిగ్గా మళ్లీ మహానాడుకు ముందు జంపింగ్ వార్త ప్రచారంలోకి రావడవంతో అంతకంతకు రాజీకీయ వాతావరణ వెడెక్కే సన్నివేశం కనిపిస్తోంది. మహానాడుని వైకాపా నీరు గార్చడానికే ఇలాంటి ఫిరాయింపులకు పాల్పడుతోందని వెబ్ మీడియా కథనాలు వేడెక్కిస్తున్నాయి. అదే నిజమైతే టీడీపీ నెంబర్ 18-19 మధ్యలో ఊగడం ఖాయం. అదే జరిగితే చంద్రబాబును చూసి జాలిపడతోన్న వారు మరింత జాలిపడక తప్పదు.