Y.S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి 2019 ఎన్నికలలో పెద్ద ఎత్తున విజయం సాధించి ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. 2019 ఎన్నికలలో ఎలాంటి పొత్తు లేకుండా సింగిల్ గా పోటీ చేసి విజయం సాధించారు. ఇలా 2019 ఎన్నికలలో 175 నియోజకవర్గాలలో 151 సీట్లను కైవసం చేసుకుని అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకున్నారు.
ఇక జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున సంక్షేమ పథకాలను అందించారు అదేవిధంగా అభివృద్ధి పథకాలను కూడా చేశారు కానీ జగన్ పట్ల రాష్ట్రవ్యాప్తంగా కాస్త నెగెటివిటీ ఏర్పడటం అదేవిధంగా కూటమి పార్టీలు ఒకటి కావడంతో జగన్మోహన్ రెడ్డి ఘోరంగా ఓటమిపాలు కావాల్సి వచ్చింది.
ఇలా 2019 ఎన్నికలలో 151 స్థానాలలో విజయం సాధించిన వైసిపి 2024 ఎన్నికలలో కేవలం 11 స్థానాలకు మాత్రమే పరిమితం కావటం అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. ఇలా వైసీపీకి 11 సీట్లే వచ్చినప్పటికీ జగన్ ఏమాత్రం నిరాశ చెందలేదు రాబోయేది మన పార్టీ తిరిగి మళ్ళీ అధికారంలోకి వస్తామని చెబుతున్నారు.
ఇకపోతే జగత్ ఇప్పటికే పార్టీ పరంగా ఎంతో యాక్టివ్ అవుతూ తిరిగి పార్టీని బలోపేతం చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇకపోతే జగన్ మళ్ళీ అధికారంలోకి రావాలి అంటే పాదయాత్ర చేయాల్సిందేనని మరికొంతమంది భావిస్తున్నారు. ఇప్పటికే జిల్లాల వారీగా టూర్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ విషయం పక్కన పెట్టి పార్టీని గ్రౌండ్ లెవెల్ లో బలోపేతం చేయాలన్న తిరిగి అధికారంలోకి రావాలన్న జగన్ పాదయాత్ర ప్రారంభించాలని అప్పుడే ఈయన అధికారంలోకి రాగలరని అందరూ భావిస్తున్నారు. కానీ ఈ విషయం గురించి వైసీపీ ఎక్కడ కూడా స్పందించకపోవడం గమనార్హం.