“కేజీఎఫ్” స్టార్ యష్ తర్వాత సినిమాపై భారీ లెవెల్లో నెలకొన్న హైప్.!

కన్నడ ఇండస్ట్రీలో ఇప్పుడు బిగ్గెస్ట్ స్టార్ గా ఎదిగిన యంగ్ హీరో యష్ కూడా ఒకడు.. యష్ హీరోగా నటించిన లాస్ట్ రెండు సినిమాలు కేజీఎఫ్ 1 మరియు కేజీఎఫ్ చాప్టర్ 2 చిత్రాలు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర సెన్సేసషనల్ హిట్ కాగా ఈ చిత్రాలు తర్వాత యాష్ సినిమాలపై ఎనలేని హైప్ ఎప్పటి నుంచో నెలకొంది.

అయితే యష్ కేజీఎఫ్ ఫీవర్ నుంచి మళ్ళీ ఆ రేంజ్ హిట్ అందుకుంటాడా లేదో అనేది ఇంకా ఎవరూ చెప్పలేని ప్రశ్న కాగా యష్ మాత్రం నెక్స్ట్ టేకప్ చేసే సినిమాపై చాలా ఆసక్తి అందరిలో నెలకొంది. ఇక ఇదిలా ఉండగా సినీ వర్గాల్లో ఇప్పుడు యష్ కెరీర్ లో 19వ సినిమాపై హాట్ టాపిక్ గా చర్చ నడుస్తుంది.

యష్ నుంచి డెఫినెట్ గా అతి త్వరలోనే భారీ అప్డేట్ రాబోతుంది అని తెలుస్తుంది. దీనితో ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చ లేస్తుండగా యష్ అయితే ఎవరితో చేస్తాడు అనేది మరింత ఆసక్తిగా మారింది.

ప్రస్తుతం అయితే చాలా మంది స్టార్ దర్శకులే ఉన్నారని బజ్ ఉంది అలాగే ఇంకా కేజీఎఫ్ చాప్టర్ 3 కూడా లైన్ లో ఉంది మరి ఈ అన్నిటిలో యష్ ఏది స్టార్ట్ చేస్తాడో వేచి చూడాల్సిందే.