KGF లో మొదట ఛాయస్  యష్   కాదా?

yash

ఒక్కోసారి ఒక నటుడు వదులుకున్న సినిమాల వల్ల అవి అందిపుచ్చుకున్న నటుడికి కెరీర్ లో సెటిల్ అయిపోయే సంఘటనలు సినిమా ఇండస్ట్రీ లో చాలానే ఉన్నాయి. అప్పట్లో కృష్ణ బిజీ గా ఉండడం వల్ల ‘ఖైదీ’ సినిమాను వదులుకున్నాడు. అదే చిరంజీవి ని సూపర్ స్టార్ చేసింది.

కొన్నాళ్ల క్రితం అల్లు అర్జున్, శర్వానంద్ లాంటి హీరోలు రిజెక్ట్ చెయ్యడం తో ‘అర్జున్ రెడ్డి’ సినిమా విజయ్ దేవరకొండ కు వెళ్ళింది. ఆ సినిమా తో విజయ్ దేవరకొండ సెన్సషనల్ హీరో అయిపోయాడు. అలాగే ‘బాహుబలి’ కోసం మొదట్లో హ్రితిక్ రోషన్, జాన్ అబ్రహం ని రాజమౌళి కలిసాడు కానీ వాళ్ళు ఆశక్తి చూపకపోవడంతో ప్రభాస్, రానా ల తో ‘బాహుబలి’ తీసాడు. ఇప్పుడు ప్రభాస్ పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

అలాగే…మొదట ప్రశాంత్ నీల్ KGF  సినిమాకు హీరోగా యష్ ని అనుకోలేదట. ఈ సినిమా ని పాన్ ఇండియా రేంజ్ లో తియ్యాలని హ్రితిక్ రోషన్ ని కలవడం కోసం చాలా కష్టపడ్డాడంట. కానీ హృతిక్ రోషన్ ని కలిసే అపాయింట్మెంట్ కూడా దొరకలేదు.

దీంతో తీవ్ర నిరాశకు గురైన ప్రశాంత్ నీల్ కన్నడ  సినిమా ఇండస్ట్రీ ఎంత గొప్పది అనేది పాన్ ఇండియన్ లెవెల్ లో చెప్పాలి అని డిసైడ్ అయ్యి యష్ ని హీరో గా సెలెక్ట్ చేసుకున్నాడు. ఏ మాత్రం హైప్ లేకుండా వచ్చిన ఈ సినిమా రిజల్ట్ ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అలాగే హీరో యష్ కూడా ఈ సినిమా తర్వాత చాలా పాపులర్ అయ్యారు. బాలీవుడ్ హీరోలతో సమానంగా క్రేజ్ సంపాదించుకున్నారు. మొదటి పార్ట్ కి మాత్రమే కాకుండా, రెండవ పార్ట్ కి కూడా చాలా మంచి గుర్తింపు లభించింది.

ఇప్పుడు మూడో పార్ట్ కూడా ఉందని ప్రశాంత్ ఒక హింట్ ఇచ్చాడు. ప్రస్తుతం ప్రభాస్ తో ‘సలార్’ సినిమాతో బిజీ గా ఉన్న ప్రశాంత్ తర్వాత ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయనున్నాడు. బహుశా ఈ రెండు సినిమాలు పూర్తి అయ్యాక KGF మూడవ పార్ట్ తీస్తాడేమో చూడాలి.