Y S.Jagan: వైయస్ జగన్మోహన్ రెడ్డి గత ఎన్నికలలో ఓటమిపాలు అయిన తర్వాత ఎక్కువగా ఈయన బెంగళూరు ప్యాలెస్ లోనే ఉంటున్నారు. వారంలో రెండు రోజులు తాడేపల్లిలో ఉంటే ఒకరోజు పులివెందులలో ఉంటున్నారు మరో రోజులు బెంగళూరుకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ఇలా జగన్మోహన్ రెడ్డి తరచు బెంగళూరుకు వెళ్లడంతో ఈయన బెంగుళూరు నుంచి అసలు రాజకీయం మొదలు పెడుతున్నారని తెలుస్తోంది.
ఇదిలా ఉండగా తాజాగా జగన్మోహన్ రెడ్డికి సంబంధించి ఒక వార్త బయటకు వచ్చింది. జగన్మోహన్ రెడ్డి కొంతమంది వైసిపి ముఖ్య నేతలను బెంగళూరుకు పిలిపించుకున్నారని తెలుస్తుంది ఇలా బెంగళూరులో వారితో భేటీ అయినటువంటి జగన్ పార్టీని తిరిగి నిలబెట్టుకోవడం కోసం కొన్ని దిశా నిర్దేశాలు చేసినట్టు తెలుస్తోంది. ఎన్నికలలో ఘోరంగా ఓటమిపాలు అవుతూ కేవలం 11 స్థానాలు మాత్రమే విజయం సాధించిన వైకాపాకు గ్రౌండ్ లెవెల్లో ఎలాంటి మద్దతు ఉందో తెలుసుకోవడానికి జగన్ సిద్ధమయ్యారని తెలుస్తోంది.
ఈ క్రమంలోనే పార్టీ సభ్యత్వాలను నమోదు చేస్తే గ్రౌండ్ లెవెల్ లో పార్టీ పరిస్థితి ఏంటి అనేది పూర్తిస్థాయిలో స్పష్టమవుతుందని జగన్ భావించారట. ఈ క్రమంలోనే సభ్యత్వాలు పూర్తి అయిన తరువాత ఈయన జనంలోకి వచ్చినప్పటికీ కూడా తన పాదయాత్రకు మంచి ప్రాధాన్యత లభిస్తుందని జగన్ భావించారట అందుకే త్వరలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వాల నమోదు ప్రక్రియ కూడా ప్రారంభం కాబోతుందని తెలుస్తుంది.
ఇకపోతే ఇప్పటికే పలువురు సీనియర్ కాంగ్రెస్ నేతలతో కూడా జగన్మోహన్ రెడ్డి చర్చలు జరిపారని త్వరలో వారందరూ కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోబోతున్నారని తెలుస్తోంది. ఇలా మెల్లిమెల్లిగా జగన్ తిరిగి తన పార్టీని పునర్నిర్మించుకోవడానికి సరికొత్త వ్యూహాలు రచిస్తున్నారు అయితే కూటమినేతలు కూడా జగన్మోహన్ రెడ్డి పట్ల ఓ కన్నేసి ఉంచారని ఆయన తీసుకొని నిర్ణయాలు ఊహాతీతంగా ఉంటాయన్న నేపథ్యంలోనే కూటమినేతలు కూడా ఎప్పటికప్పుడు అలర్ట్ అవుతున్నారని తెలుస్తుంది.