Crime: వరకట్నం ఇవ్వకపోవడంతో పెళ్లిరద్దు చేసిన వరుడి కుటుంబం.. మనస్తాపంతో వధువు ఇలా!

Crime: వరకట్నం ఇవ్వడం తీసుకోవడం చట్టరీత్యా నేరమని తెలిసినప్పటికీ వరకట్నం గురించి ప్రభుత్వాలు ఎన్ని చట్టాలు చేసినప్పటికీ రోజురోజుకు మహిళలపై వరకట్నపు వేధింపులు ఎక్కువ అవుతున్నాయి. ఈ క్రమంలోనే ప్రతిరోజూ ఎంతో మంది మహిళలు ఈ వరకట్నపు వేధింపులను భరించలేక ఆత్మహత్య చేసుకున్న ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా ఇలాంటి ఘటన లక్నోలో చోటు చేసుకుంది.అయితే ఈ వధువుకు పెళ్లి కాకముందే వరకట్న వేధింపులు తలెత్తడంతో తీవ్ర మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లక్నోలో చోటు చేసుకుంది. పూర్తి వివరాల్లోకి వెళితే…

యూపీలోని కేడీ గ్రామంలో ఖుష్బు అనే యువతికి సమీప​ గ్రామంలోని యూనస్‌తో వివాహం నిశ్చయమయింది. వీరి వివాహం వచ్చే నెల ఫిబ్రవరిలో ఖరారు చేయడంతో పెళ్లి సమయానికి వధువు కుటుంబ సభ్యులు వారి కుటుంబానికి ఐదు లక్షల కట్నం, కారు ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఇలా వరుడు కుటుంబ సభ్యులు డిమాండ్ చేయడంతో వధువు కుటుంబ సభ్యులు ముందుగా అడిగిన కట్నాన్ని ఇవ్వడానికి ఒప్పుకున్న ఆ కట్నం ఇప్పుడే ఇవ్వలేమని, పెళ్లిలోగా ఇస్తామని చెప్పారు.

ఇలా సరైన సమయానికి వధువు కుటుంబ సభ్యులు వరకట్నం చెల్లించకపోవడంతో వరుడు కుటుంబ సభ్యులు వీరి వివాహాన్ని రద్దు చేశారు. ఇలా ఈ వివాహం రద్దు కావడంతో ఎంతో మనస్తాపం చెందిన వధువు ఖుష్బూ ఇంట్లో ఎవరూ లేని సమయం చూసి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ క్రమంలోనే వధువు తల్లిదండ్రులు ఇదే విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.