Bigg Boss: తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అతిపెద్ద రియాల్టీ షో అయిన బిగ్ బాస్ షో గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. త్వరలోనే మొదలు కాబోతున్న బిగ్ బాస్ షో కోసం ప్రేక్షకులు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. కాగా ఇప్పటివరకు ఎనిమిది సీజన్లు విజయవంతంగా పూర్తి చేసుకున్న విషయం తెలిసిందే. ఇందులో ఒక ఓటీటీ సీజన్ కూడా ఉంది. త్వరలోనే తొమ్మిదవ సీజన్ ప్రారంభం కాబోతోంది. ఇప్పటికీ బిగ్బాస్ షో నిర్వాహకులు ప్రోమో లను కూడా విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈసారి కూడా నాగార్జున బిగ్ బాస్ హోస్ట్ గా వ్యవహరించబోతున్నారు.
ఈసారి చదరంగం కాదు రణరంగం అంటూ హోస్ట్ నాగార్జున పంచ్ డైలాగ్ బిగ్ బాస్ కొత్త సీజన్ పై ఆసక్తి పెంచింది. ఇక బిగ్ బాస్ కంటెస్టెంట్ల ఎంపిక ప్రక్రియ కూడా శరవేగంగా జరుగుతోంది. ఇకపోతే బిగ్ బాస్ హౌస్ లోకి ఎంట్రీ ఇవ్వబోయే సెలబ్రిటీల జాబితా ఇదే అంటూ చాలామంది పేర్ల వినిపించిన విషయం తెలిసిందే. మాములుగా బిగ్ బాస్ హౌస్ లోకి బుల్లితెర ప్రముఖులు, యూట్యూబర్లు, సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెర్లనే ఇందులోకి కంటెస్టెంట్లుగా తీసుకుంటారు. గతంలో కొన్ని సార్లు సామాన్యులను తీసుకొచ్చినా పెద్దగా వర్కవుట్ అవ్వలేదు.
https://www.instagram.com/reel/DLtu2PBzN06/?utm_source=ig_web_copy_link
అయితే ఇప్పుడు బిగ్ బాస్ టీం మరోసారి సామాన్య ప్రజలకు ఒక బంపరాఫర్ ఇచ్చింది. ఇక బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళడానికి ఇప్పటికే చాలా మంది అప్లై చేస్తున్నారు. ఇక చాలా మంది సామాన్యులు కూడా బిగ్ బాస్ లోకి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. ఇక కొంతమంది సోషల్ మీడియా ద్వారా మమ్మల్ని బిగ్ బాస్ లోకి పంపండి అంటూ సోషల్ మీడియాలో రకరకాల వీడియోలు చేస్తూ షేర్ చేస్తున్నారు. ఇప్పటికే కొంతమంది రిక్వెస్ట్ చేస్తూ వీడియోలు షేర్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా అలాంటి వీడియో ఒకటి వైరల్ గా మారింది. నాగార్జున గారు నన్ను బిగ్ బాస్ హౌస్ లోకి పంపండి.. మిమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకుంటా.. మీకు అద్భుతమైన టీ, అద్భుతమైన కాఫీ ఇస్తాను. మీకే కాదు అందరికి మంచి ఛాయ్ పెట్టి.. రోటి పచ్చళ్ళతో మంచి భోజనం చేసి పెడతాను. ఒక్కసారి అవకాశం ఇస్తే జీవితాంతం మీకు రుణపడి ఉంటా అంటూ వీడియో చేసి షేర్ చేసింది ఆ మహిళ. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ వీడియోకు నెటిజన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.
