Huzurabad: సమాజంలో రోజురోజుకీ ఆడవారి పరిస్థితి దారుణంగా తయారవుతోంది. చిన్నపిల్లల నుంచి పండు ముసలి వారి వరకూ ప్రతి ఒక్కరు కూడా బయటికి వెళ్ళాలి అంటే భయపడాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. మరొకవైపు పెళ్లైన మహిళలను చాలా మంది భర్తలు శారీరకంగా మానసికంగా హింసిస్తున్నారు. ఇంకొందరు అయితే కట్టుకున్న భార్యను విడిచి పెట్టి ప్రియురాలి మోజులో పడి చివరికి తాళికట్టిన భార్యను కూడా చంపడానికి వెనకాడటం లేదు. ఇంకొందరు అయితే కట్టుకున్న భార్యను కాదని పరాయి మహిళల మోజులో పడి సంసారాలను విచ్చిన్నం చేసుకుంటున్నారు. తాజాగా ఇలాంటి ఘటన ఒకటి చోటు చేసుకుంది. భర్త కాపురానికి తీసుకెళ్లలేదు అని భర్త ఇంటి ఎదుట దీక్ష చేపట్టిన మహిళ ఆత్మహత్యకు ప్రయత్నించిన చివరికి చికిత్స పొందుతూ మృతి చెందింది. పూర్తి వివరాల్లోకి వెళితే..
ఈ సంఘటన కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో చోటుచేసుకుంది. కడప జిల్లాకు చెందిన ఆవుల సుహాసిని, హుజురాబాద్ కు చెందిన నరహరి సుజిత్ 2020 నవంబర్ లో ఆర్య సమాజ్ లో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత సుహాసిని ని భర్త సుజిత్ కాపురానికి తీసుకెళ్లకపోవడంతో 2021లో ఆమె కడప జిల్లా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ క్రమంలోనే సుహాసిని నవంబర్ 26 నుంచి తనకు న్యాయం చేయాలి అంటూ భర్త ఇంటి ముందు 40 రోజులకు పైగా దీక్ష చేపట్టింది. గూగుల్ గడుస్తున్నా కూడా సుజిత్ ఆమెను పట్టించుకోకపోవడంతో పాటుగా, సుజిత్ కు ఇదివరకే పెళ్లి అయ్యి పిల్లలు కూడా ఉన్నట్లు తెలియడంతో మనస్థాపానికి గురి అయ్యి పురుగుల మందు తాగింది.
వెంటనే స్థానికులు ఆమెను హుటాహుటిన వరంగల్లోని ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు. హాస్పటల్ లో చికిత్స పొందుతూ సుహాసిని మరణించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సుహాసిని వద్ద ఆత్మహత్యకు ప్రయత్నించక ముందు సూసైడ్ నోట్ రాసినట్లు పోలీసులు తెలిపారు. బతికి ఉంటే తనకు న్యాయం జరగడం లేదని అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్లు ఆ నోట్ లో రాసినట్లు పోలీసులు పేర్కొన్నారు. చనిపోయిన తర్వాత తన అవయవాలు దానం చేయాలని సూ సైడ్ నోట్ లో పేర్కొంది. అంతే కాకుండా తన చావుకు కారణమైన వారిని కఠినంగా శిక్షించాలి అని వేడుకుంది. సుహాసిని మరణవార్త తెలిసిన సుజిత్ కుటుంబ సభ్యులు ఇంటికి తాళం వేసుకుని వెళ్లిపోయారు.