Sameer: సెట్లో తనకు కోపంతో పాటు, బాధను కలిగించిన ఓ సంఘటన గురించి ప్రముఖ నటుడు సమీర్ ఇలా చెప్పారు. అది శ్రీరామరాజ్యం సినిమా చేస్తున్నపుడు జరిగిందని ఆయన చెప్పుకొచ్చారు. తనకు బాగా ఇష్టమైన కో-డైరెక్టర్ శ్రీనివాస్ అని ఉన్నారని, ఆయన చెప్పిందేంటంటే సమీర్ గారిది 2గంటలకు క్లోజ్ షాట్ ఉంది. ఆయన్ని రెడీ అవ్వమని చెప్పండి. 2.15కి బాలకృష్ణ గారికి చెప్పండి అని అన్నారని ఆయన తెలిపారు. 2కి అంటే బాపు గారు 1.55వరకు ఆయన కచ్చితంగా ఉంటారని సమీర్ చెప్పారు.
ఇకపోతే అప్పటికే చాలా విషయాలు చూసుకుంటున్నారు శ్రీనివాస్ గారు. కావాలనేం చేయలేదు. దాంట్లో బిజీ అయిపోయి తనకు ఆ విషయం చెప్పడం మరిచిపోయారని సమీర్ అన్నారు. మామూలుగా అయితే 1 నుంచి 2.30వరకు బ్రేక్ టైం అని, తాను 2వరకు టచ్‌అప్‌కి కూర్చుంటే సరిపోతుంది కదా అనుకున్నాని ఆయన చెప్పారు. అనుకున్నట్టుగానే 2గంటలకు మేకప్‌కి కూర్చున్నానని, వెంటనే అసిస్టెంట్ డైరెక్టర్ పరిగెత్తుకుంటూ వచ్చి సర్, సర్ షాట్ రెడీ రెడీ అని అరుచుకుంటూ వచ్చారని ఆయన అన్నారు. ఏంటీ 2.30 అని చెప్పారు కదా అని అంటే, దానికి వారు కాదంటీ ఫస్ట్ మీది క్లోజ్ షాట్ ఉంది మీకు చెప్పలేదా అని అన్నారని సమీర్ చెప్పారు. ఎవరు చెప్పాలి నాకు అంటే శ్రీనివాస్ చెప్పాలి అన్నారని, అంతలో ఆయన్నే పరిగెత్తూ వచ్చారని ఆయన అన్నారు.
అలా వచ్చీ రాగానే సర్ చెప్పడం మర్చిపోయాను. వెంటనే ఇప్పుడు షాట్ పెట్టాలని శ్రీనివాస్ అన్నపుడు తనకు నిజంగానే చాలా కోపం వచ్చిందని సమీర్ అన్నారు. దాంతో పాటు బాధ కూడా వచ్చిందని ఆయన అన్నారు. అప్పటికీ బాలకృష్ణ వచ్చేశారని, టైం అయిపోయిందని కూడా ఆయన అన్నారు. అప్పుడు బాపు గారు వచ్చి పక్కకు తీసుకెళ్లి ఏమండీ కనీసం నా మాటకు వాల్యూ ఇవ్వాలి కదండీ .. 2గంటలకు అని చెప్పాం కదా అని తనకు చెప్తున్నపుడు వెనక నుంచి శ్రీనివాస్ ఏం చెప్పొద్దని సైగ చేశాడని సమీర్ వివరించారు. అప్పుడు బాపు గారు నేను తీసిన కొన్ని సినిమాలు కూడా హిట్ అయ్యాయండీ అన్నపుడు… ఇంతకన్నా ఏమైనా తిడితే బాగుండు కానీ, అలా అన్నందుకు ఏదోలా అనిపించిందని సమీర్ తెలిపారు.