తెలుగు సినిమా ఇండస్ట్రీ లో దాదాపు రెండు దశాబ్దాలు నుండి ఉన్న మంచు హీరోస్, నితిన్, దశాబ్ద కాలం పైగా ఉన్న నాని, నాగ చైతన్య, నిఖిల్ లాంటి హీరోస్ ఎన్ని హిట్స్ ఇచ్చినా కానీ ఇప్పటికీ స్టార్ డం రాలేదు. అయితే కేవలం ‘అర్జున్ రెడ్డి’ అనే ఒక్క సినిమా హిట్ తో క్రేజీ స్టార్ గా మారిపోయాడు విజయ్ దేవరకొండ.
ఆ సినిమా తర్వాత ‘గీత గోవిందం’ హిట్ అయినా కానీ తరువాత వరుస ప్లాపులు పలకరించాయి. తాజాగా వచ్చిన ‘లైగర్’ సినిమా పూర్తిగా నిరాశపరిచింది. సూపర్ స్టార్ అన్న భావనతో విజయ్ బిహేవియర్ కూడా చాలా మందికి చిరాకు తెప్పిస్తుంది.
‘లైగర్’ సినిమా రిసల్ట్ ఇక ఈ విజయ్ దేవరకొండ తన రాబోయే సినిమాలపై కాస్త పడింది అని చెప్పవచ్చు. ఇండస్ట్రీ లో సక్సెస్ ఉంటేనే అందరూ ఎత్తేస్తారు, లేకుంటే ఎంత పెద్ద హీరో అయినా అటువంటి హీరోలు పట్టించుకోవడం కూడా మానేస్తారు.
ఇప్పటికే ఇలాగా ఎంతోమంది హీరోల విషయంలో జరిగిన విషయం తెలిసిందే.ప్రస్తుతం విజయ్ దేవరకొండ పరిస్థితి కూడా అదే అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ‘లైగర్’ సినిమా ప్లాప్ పూరి జగన్నాధ్ కంటే విజయ్ నే ఎక్కువగా ట్రోలింగ్స్ కు గురయ్యాడు.
ఇప్పుడు విజయ్ దేవరకొండ అన్న మాటలను ట్యాగ్ మా తాత ఎవరో తెలవదు.మా అయ్య ఎవరో తెలవదు.అంటూ యాటిట్యూడ్ చూపిస్తే ఇండస్ట్రీలో మనం ఎవరో తెలియకుండా పోతుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.