హరీష్ రావు ముందు ఆ ఇద్దరు నిలబడేనా..?

harish rao dubbaka telugu rajyam

 దుబ్బాక ఉప పోరు కీలక స్థాయికి చేరుకుంది. అన్ని పార్టీల అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో మునిగిపోయారు. నామినేషన్ పక్రియ మొదలు కావటంతో పార్టీ శ్రేణులు కూడా ఉత్సహంగా ఎన్నికల ప్రచారంలో దూసుకెళ్తున్నారు. ప్రధానంగా తెరాస, బీజేపీ, కాంగ్రెస్ మధ్య పోటీ జరుగుతుంది. ఈ త్రిముఖ పోటీలో తెరాస పార్టీకి ఎక్కువగా విజయావకాశాలు ఉన్నాయి. సోలిపేట రామలింగా రెడ్డి చనిపోవటంతో ఆయన భార్య సుజాతను కేసీఆర్ రంగంలోకి దించాడు. మరోపక్క కాంగ్రెస్ నుండి తెరాస పార్టీ రెబల్ అభ్యర్థి చెరకు శ్రీనివాస్ రెడ్డి, బీజేపీ నుండి రఘునందన్ రావులు పోటీచేస్తున్నారు.

dubbaka by elections telugu rajyam

 

 దుబ్బాకలో ఎలాగైనా సరే మరోసారి విజయకేతనం ఎగురవేయాలని భావించిన కేసీఆర్ నెల రోజుల క్రితమే ఆ బాధ్యతలు హరీష్ రావు కు అప్పగించాడు. దీనితో అన్ని పార్టీల కంటే ముందుగానే హరీష్ రావు అక్కడ ప్రచారం చేసి, ప్రతి గ్రామాన్ని పలకరించాడు. మిగిలిన పార్టీలు ఎన్నికల కోసం సిద్దమైయ్యే లోపే హరీష్ రావు ప్రచారం మొదటి పర్వం పూర్తయిపోయింది. ఆ సమయంలోనే కాంగ్రెస్ బీజేపీ లోని అసంతృప్తి నేతలకు గుర్తించి తెరాస పార్టీలోకి తీసుకోని వచ్చే కార్యక్రమం మొదలుపెట్టాడు. దానికి తోడు సిద్దపేట, దుబ్బాక రెండు కళ్ళు లాంటివి నాకు అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేస్తూ, నన్ను చూసి ఎన్నికల్లో ఓట్లు వేయండి, దుబ్బాకను మరో సిద్దిపేట చేస్తానని మీకు మాటిస్తున్న అని చెపుతూ తనదైన శైలి లో ప్రచారం చేస్తున్నాడు.

  మరోపక్క సుజాత ను ముందుపెట్టి సానుభూతి ఓట్లు, మహిళల ఓట్లు కొల్లకొట్టే వ్యూహంతో వెళ్తున్నాడు. హరీష్ రావు దూకుడు, అతని రాజకీయ వ్యూహాల ముందు మిగిలిన పార్టీలు తేలిపోతున్నాయి. చివరి వరకు కాంగ్రెస్, బీజేపీ పార్టీలలో టిక్కెట్ కోసం పెద్ద యుద్ధమే జరిగింది. తీరా టిక్కెట్ ఖరారైన తర్వాత పార్టీలో వ్యతిరేకత రావటం, వాళ్ళని బుజ్జగించటం, బుజ్జగింపులు లొంగని వాళ్ళు తెరాస లో చేరటం లాంటివి జరిగాయి. దీనితో ఆ రెండు పార్టీల వాళ్ళు ఎన్నికల వ్యూహం అమలుచేయడంలో వెనకపడిపోయారు.

  హరీష్ రావు లాంటి నేతకు ఢీ కొట్టాలంటే ఆయనకంటే బలమైన వ్యూహాలు సిద్ధం చేసుకొని, ఎన్నికల గోదాంలోకి దిగాలి. అవేమి లేకుండా దిగితే హరీష్ రావు ముందు తేలిపోవటం ఖాయమనే చెప్పాలి. మరి కాంగ్రెస్, బీజేపీ అభ్యర్దులు తెరాస ట్రబుల్ షూటర్ ముందు ఎంత వరకు నిలబడుతారో చూడాలి. ఈ నెల 9 నుండి దుబ్బాక ఉప ఎన్నికల నామినేషన్స్ పక్రియ మొదలైంది. 16 వ తేదీ నామినేషన్స్ పరిశీలిన ఉంటుంది. 19 తేదీ వరకు నామినేషన్స్ విత్ డ్రా లు ఉంటాయి. నవంబర్ 3 న పోలింగ్ నిర్వహించి, నవంబర్ 10 న ఫలితాలు ప్రకటించబోతున్నారు