జ‌గ‌న్ స‌ర్కార్ పై  బీజేపీ కుట్ర పన్నుతోందా?

కేంద్రం ఏపీలో జ‌గ‌న్ ఏడాది పాల‌న‌ను ఆకాశానికి ఎత్తేస్తే…స్టేట్ బీజేపీ అధ్య‌క్షుడు క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మాత్రం ఎండ‌గ‌ట్టే కార్య‌క్ర‌మం పెట్టుకున్నారు. జ‌గ‌న్ పాల‌న దేశానికి ఆద‌ర్శంగా ఉంద‌ని కేంద్రం అంటుంటే..క‌న్నా మాత్రం జ‌గ‌న్ ప‌ద‌వికి  అర్హుడు కాద‌ని…త‌క్ష‌ణం సీఎం ప‌ద‌వికి రాజీనామా చేయాల‌ని డిమాండ్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. కేంద్రం విష‌యంలో మొద‌టి నుంచి జ‌గ‌న్ సైలెంట్ గానే ఉంటున్నారు. కేంద్రం ఇచ్చింది తీసుకుంటూ త‌న ప‌నేదో తాను చేసుకుంటూ వెళ్లిపోతున్నారు. దీంతో కేంద్రం-ఏపీ మ‌ధ్య‌ స‌త్స‌సంబంధాలు బాగానే ఉన్నాయ‌ని ప్ర‌జ‌లు స‌హా పార్టీలు అనుకుంటున్నాయి. ఇక క‌న్నా మాత్రం ఎప్ప‌టిక‌ప్పుడు విమ‌ర్శ‌లు గుప్పిస్తూ ఆయ‌న ప‌నిలో ఆయ‌న బిజీగా ఉన్నారు.

అయితే ఇక్క‌డ క‌మ‌ల‌నాధుల‌ను అంత ఈజీగా న‌మ్మ‌డానికి లేదు. ప్ర‌ధాని మోదీ-అమిత్ షాల వ్యూహాల ముందు ఎంత‌టి వారైన చిత్తు అవ్వాల్సిందే అన‌డానికి ఎన్నో ఉద‌హార‌ణ‌లున్నాయి. ఏ రాష్ర్టంలో వీక్ గా ఉందో చూసుకుని అక్క‌డ క‌మ‌ల‌నాధులు సైలెంట్ గా ఆప‌రేష్ మొదలు పెట్టి మొత్తానికే లేపేస్తారు. ఛాన్స్ ఇవ్వ‌డ‌మే ఆల‌స్యం.మీద‌కెక్కి కూర్చుంటారు. రాష్ర్టాల‌పై ప‌ట్టు సాధించే విష‌యంలో షావ్యూహం అలా ఉంటుంది మ‌రి. క‌ర్ణాట‌కలో కుమార‌స్వామి ప్ర‌భుత్వాన్ని కూల్చి యాడ్యుర‌ప్ప స‌ర్కాను పీఠంపై కూర్చొబెట్టింది. ఆ ప‌క్క రాష్ర్టం త‌మిళ‌నాడులోనూ త‌మ‌కు న‌చ్చిన నాయ‌కుల‌ను అధికారంలోకి తెచ్చుకుంది. మ‌ధ్య‌ప్ర‌దేశ్ లోనూ ప్ర‌జాస్వామ్య బ‌ద్దంగా నెగ్గిన కాంగ్రెస్ లో చిచ్చు పెట్టి శివ‌రాజ్ సింగ్  చౌహన్  అధికారంలోకి తేవ‌డంలో కీల‌క పాత్ర పోషించింది.

ఇలా ఏ గ‌వ‌ర్న‌మెంట్ వీక్ గా ఉంటే అక్క‌డ బీజేపీ కుయుక్తులతో  క‌మ‌ల‌ద‌ళాన్ని దించుతుంటుంది. తెలుగు రాష్ర్ట‌ల్లో కూడా బీజేపీ పాగా వేయాల‌ని కొన్నాళ్ల‌గా గ‌ట్టి ప్ర‌య‌త్నాలే చేస్తుంది. దీనిలో భాగంగా జ‌గ‌న్ పై వ్య‌తిరేక‌త తీసుకొచ్చే ప్ర‌య‌త్నాలు చేస్తున్న‌ట్లు ఓ జాతీయ మీడియా క‌థ‌నం వేడెక్కిస్తోంది. ప్ర‌జ‌ల్లోనూ, మేథావుల్లోనూ జ‌గ‌న్ పై వ్య‌తిరేక ఆలోచ‌న‌లు వ‌చ్చేలా వ్యూహాత్మ‌కంగా వ్య‌వ‌హ‌రించి..జ‌గ‌న్ తీసుకునే నిర్ణ‌యాలు త‌ప్పుబ‌ట్టేలా చేస్తున్నార‌న్న‌ది ఓ జాతీయ మీడియా క‌థ‌నం వెల్ల‌డించింది. అయితే అదంత ఈజీ కాదు ఏపీలో జ‌గ‌న్ స‌ర్కార్ చాలా బ‌లంగా ఉంది. దేశంలోని ఏ రాష్ర్టంలోనూ లేని విధంగా వైకాపా చాలా బ‌లంగా పాతుకుపోయింది.