కాంగ్రెస్ పార్టీ ఫైర్ బాండ్ లీడర్ రేవంత్ రెడ్డిని తెరాస ప్రభుత్వం టార్గెట్ చేసిందా అంటే అవుననే సమాధానం వినిపిస్తుంది. రేవంత్ రెడ్డి టీడీపీ పార్టీ లో ఉన్నప్పుడు నామినేటెడ్ ఎమ్మెల్యే స్టీఫెన్సన్ ను డబ్బుతో ప్రలోభపెట్టడానికి రేవంత్ రెడ్డి, ముత్తయ్య మరియు సండ్ర వీరయ్య కలిసి ఈ కుట్ర చేసినట్లు, దీనికి 2015 మహానాడులోనే బీజం పడినట్లు తెలుస్తుంది. ఈ కేసులో ఏసీబీ పక్కా ఆధారాలు సేకరించి కేసులో ఎవరు తప్పించుకోకుండా చూస్తుంది., ఓటుకు నోటు కేసులో తాజాగా కీలక పరిణామం చోటుచేసుకుంది.
తనను ఈ కేసులో అక్రమంగా ఇరికించారని.. ఈ కేసు నుంచి తన పేరు తొలగించారంటూ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మరో నిందితుడు ఉదయసింహ దాఖలు చేసుకున్న డిశ్చార్జ్ పిటీషన్లపై ఏసీబీ ఇటీవల కౌంటర్ దాఖలు చేసింది. టీడీపీ ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య వాదనను ఏసీబీ తోసిపుచ్చింది. ఈ కేసును నిరూపించటానికి తగిన ఆధారాలు అన్ని ఉన్నాయని, నిందితులు వేసిన పిటిషన్ లు కొట్టేయాలని ఏసీబీ న్యాయస్థానాన్ని కోరింది. దీనితో ఈ కేసును కోర్టు ఈ నెల 27 కు వాయిదా వేసింది. ఏసీబీ దగ్గర ఈ కేసుకు సంబధించిన కీలక ఆధారాలు ఉన్నాయని వాటిని కోర్టుకు సమర్పిస్తే , రేవంత్ రెడ్డికి తదితరులు శిక్ష పడే అవకాశం ఉందని తెలుస్తుంది .
అయితే ఈ కేసు అంత త్వరగా తేలుతుందా అనేది అనుమానమే, గతంలో ఇదే కేసు విషయంలో చంద్రబాబు మీద ఒత్తిడి తీసుకొనివచ్చి బాబు హైదరాబాద్ ను వదిలివెళ్లేలా చేశాడు కేసీఆర్. ఈ కేసులో బాబు హస్తముందని స్వయంగా కేసీఆర్ చెప్పాడు, కానీ ఇప్పుడు ఆ కేసులో అసలు బాబు ప్రమేయం లేదని ఏసీబీ చెప్పటం జరిగింది. ఇలాంటి కేసులు అధికార పార్టీ చేతిలో ఉంటే, ప్రత్యుర్థులు తోక జాడించిన ప్రతిసారి ఈ కేసును ఉపయోగించుకొని వాళ్ళని దారికి తెచ్చుకోవచ్చు. సండ్ర వీరయ్య , ముత్తయ్య విషయం పక్కన పెడితే రేవంత్ రెడ్డి లాంటి నేత చిక్కుకున్న ఈ కేసును అంత త్వరగా తేల్చేసి, ముగించే ఆలోచనలో కేసీఆర్ లేడని తెలుస్తుంది. ప్రభుత్వ చేతిలో ఉండే ఏసీబీ కాబట్టి ప్రభుత్వ పెద్దలను దాటి ముందుకుపోదులే