MLA Roja : వైసీపీ ఎమ్మెల్యే రోజా హోం శాఖని ఆశిస్తున్నారా.?

MLA Roja :  మొదటి దఫా మంత్రి వర్గంలోనే హోం మంత్రి పదవిని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఆశించారనే ప్రచారం అప్పట్లో జరిగింది. కానీ, ఎలాంటి మంత్రి పదవీ ఆమెకు అప్పట్లో దక్కలేదు. ఈసారి రోజాకి మంత్రి పదవి ఖాయమనే ప్రచారం జరుగుతోంది. అన్ని సమీకరణాలూ ఆమెకు ఈసారి అనుకూలించాయనే అంటున్నారు.

అయినాగానీ, చివరి నిమిషం వరకూ రోజా ‘లక్కు’ మీద ఆశలు పెట్టుకోలేని పరిస్థితి. సమర్థత లేక కాదు, చుట్టూ వున్న కొన్ని వ్యతిరేక శక్తుల ప్రభావంతోనే రోజాకి పదవులు దక్కడంలేదన్నది నిర్వివాదాంశం. ఆ శక్తులు కూడా సొంత పార్టీలోనే వున్నాయ్ అన్నది ఆమె ఆవేదన.

టీడీపీలో వున్నప్పుడు కూడా సొంత పార్టీలోనే ఆమెకు శతృవులుండేవారు. వైసీపీలోకి వచ్చాక కూడా ఆమె చుట్టూ ఆ నెగెటివ్ ఫోర్సెస్ గట్టిగా పని చేస్తున్నాయంటే.. అది ఆమె తప్పిదమా.? అన్న కోణంలోనూ రకరకాల విశ్లేషణలు జరుగుతుంటాయి.

అసలు 2024 ఎన్నికల్లో నగిరి ఎమ్మెల్యే అభ్యర్థిగా రోజాకి టిక్కెట్ ఇవ్వకూడదనే డిమాండ్లూ వైసీపీ నుంచే తెరపైకొస్తున్న సంగతి తెలిసిందే. ఇంత నెగెటివిటీ మధ్య రోజా మంత్రి పదవి దక్కించుకుంటే అది చాలా చాలా గొప్ప విషయమే.

అందునా, రోజా ఆశిస్తున్నట్లు ఆమెకు హోం మంత్రి పదవి దక్కుతుందా.? దక్కితే మాత్రం రాజకీయ ప్రత్యర్థుల్ని ఆమె  ఓ ఆట ఆడించేస్తారు.

అందుకే, ఆ రాజకీయ ప్రత్యర్థులు (సొంత పార్టీకి చెందినవారే) ఎట్టి పరిస్థితుల్లోనూ అసలు రోజాకి మంత్రి పదవి రాకూడదని గట్టిగా కోరుకుంటున్నారట.